మరికొన్ని రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఇప్పటికే నామినేషన్ల పర్వం కూడా పూర్తి అయింది. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమిలో భాగంగా పోటీ చేస్తున్న టీడీపీ , జనసేన , బీజేపీ ఒక వర్గంగా ఉంటే , ప్రస్తుతం అధికారంలో ఉన్న వైసీపీ ఒక వర్గంగా ఉంది. ఈ రెండు వర్గాల మధ్య ప్రస్తుతం పోరు బలంగా నెలకొంది. ఇక అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడిన వేళ అనేక సర్వేలు తమ సర్వే రిపోర్ట్ లను విడుదల చేస్తూ వస్తున్నాయి.

అందులో ఓ సర్వేలో కూటమి వైపు ఎడ్జ్ కనబడుతూ ఉంటే , మరో సర్వేలో వైసీపీ వైపు ఎడ్జ్ కనబడుతుంది. ఓ సర్వేలో మగవాళ్ళు ఎక్కువ శాతం కూటమి వైపు ఉంటే , మరో సర్వేలో ఆడవాళ్లు కూటమి వైపు ఉంటున్నారు. అలాగే ఓ సర్వేలో వైసీపీ వైపు మహిళలు ఉంటే , మరో సర్వేలో పురుషులు ఉంటున్నారు. ఇలా సర్వేలు వివిధ రకాలుగా ఉండడంతో గెలుపు అవకాశాలు ఎవరి సైడ్ ఉన్నాయో ఎవరికీ అర్థం కావడం లేదు.

ఇకపోతే చంద్రబాబు కొన్ని రోజుల క్రితం మేము అధికారంలోకి వచ్చినట్లు అయితే ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలను తీసుకు వస్తాము అని చెప్పాడు. దీనికి జగన్ కౌంటర్ ఇస్తూ ... చంద్రబాబు అధికారం లోకి వస్తే అనేక సంక్షేమ పథకాలను తీసుకువస్తాను అంటున్నాడు. ప్రస్తుతం రాష్ట్రం అప్పుల్లో ఉంది అని ఆయనే అన్నారు. ఎలా సంక్షేమ పథకాలను అమలు పరుస్తారు అని అడిగితే సంపదను సృష్టిస్తాను అని అంటున్నారు.

ఆయన 14 సంవత్సరాలు ముఖ్య మంత్రిగా చేశారు. ఆయన ముఖ్యమంత్రి గా ఉన్న సమయం లో రెవిన్యూ లోటు అధికంగా ఉంది. అప్పుడు రెవెన్యూ లోటును సృష్టించిన ఆయన ఇప్పుడు అధికారం లోకి వచ్చి ప్రజలకు సంపదను సృష్టిస్తాడా మీరే ఆలోచించండి అని జగన్ చెప్పుకొస్తున్నాడు. ఇక ఈ రెండు వర్గాలు కూడా ప్రస్తుతం ఒకరిపై ఒకరు మాటల దాడి చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: