•బాబు చేసిన తప్పే జగన్ ను మళ్ళీ సీఎం చేస్తోందా..
•ఆ ఓటర్లంతా జగన్ వైపే..
(అమరావతి - ఇండియా హెరాల్డ్)
ఆంధ్రప్రదేశ్లో గత మూడు నెలలుగా ఎన్నికల పోరు హోరాహోరి గా జరిగింది.. ముఖ్యంగా ఎవరు అధికారంలోకి వస్తారన్న విషయం పక్కన పెడితే.. అభ్యర్థుల ప్రకటన విషయంలో అధికారులు మరింత నిర్లక్ష్యం వ్యక్తం చేశారు.. టికెట్టు వస్తుందని ఆశించిన చాలా నియోజకవర్గాల అభ్యర్థులు టికెట్లు రాక భంగపడ్డారు.ముఖ్యంగా వీరి భంగపాటు పార్టీకే వెన్నుపోటుగా మారింది.. ముఖ్యంగా కూటమిలో భాగంగా బిజెపి, జనసేన,టిడిపి పొత్తు కుదురుచుకున్న విషయం తెలిసిందే.. ఇక దీంతో టీడీపీ తరఫున కొన్ని నియోజకవర్గాలలో కొన్ని సామాజిక వర్గానికి చెందిన అధినేతలు తమకు టికెట్ వస్తుందని ఎంతో భావించారు.. కానీ టికెట్ దక్కకపోవడంతో వారు టికెట్ దక్కిన వారికి సహాయం చేయకపోగా.. తమ నియోజకవర్గానికి చెందిన ఓట్లన్నీ కూడా వారికి వ్యతిరేకంగా ఉండేలా చేశారు.. అలా చాలామంది ఓటర్లు కూటమి నుంచి వైసీపీకి మళ్ళినట్లు తెలుస్తోంది.
ఇక ఈ అంశమే వైసీపీకి బాగా కలిసి వచ్చిందని చెప్పాలి.. ఇకపోతే టిడిపి, జనసేన పార్టీలు పొత్తు పెట్టుకుని ఉండి ఉంటే మైనారిటీలు , ముస్లింలు, బీసీలు టిడిపి వైపు మొగ్గు చూపేవారు. కానీ బీజేపీని కూటమిలో కలుపుకోవడం వల్ల చాలా వరకు మైనారిటీ ఓట్లన్నీ వైసీపీకే చేరిపోయాయి.. అలాగే బీసీల్లో కొన్ని సామాజిక వర్గానికి చెందిన వారు కూడా వైసిపీ కి ఓటు వేయడం జరిగింది ..ఇక చాలావరకు ఎస్సీ, ఎస్టీ ఓట్లు కూడా వైసీపీకే రావడానికి కారణం ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అని చెప్పవచ్చు.. ఒక బీజేపీతో చంద్రబాబు పొత్తు పెట్టుకోవడమే మైనార్టీలను వైసీపీ వైపు మళ్ళేలా చేశాయని చెప్పవచ్చు.
ఇక అలా ఉన్నచోటనే పోటీ చేయకుండా ఇతర పార్టీలను తమలో కలుపుకొని ఉన్న ఓటర్లను కూడా కోల్పోయారు చంద్రబాబు నాయుడు.. ఇకపోతే ప్రస్తుతం అధికారంలోకి ఎవరు వస్తారు అన్న ఉత్కంఠ నెలకొనగా.. చాలామంది వైసిపి పార్టీ వైపే మొగ్గు చూపుతున్నారు. సంక్షేమ పథకాలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి.. అందులో భాగంగానే ఇప్పుడు మళ్లీ వైసీపీకే పట్టం కట్టే ప్రయత్నం చేస్తున్నారు.. మొత్తానికైతే బాబు చేసిన తప్పు జగన్ ను మళ్ళీ అధికారంలోకి తీసుకొస్తోంది అనడంలో సందేహం లేదు.