- ( అమ‌రావ‌తి - ఇండియా హెరాల్డ్ ) .

తెలుగుదేశం పార్టీ లో ఇప్పుడు ప‌ద‌వుల పండ‌గ వాతావ‌ర‌ణం నెల‌కొంది. ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారం లోకి వ‌చ్చి రెండు నెల‌లు కావొస్తోంది. ఇప్ప‌టి వ‌ర‌కు నామినేటెడ్ ప‌ద‌వుల‌ను పంపిణీ చేయ‌లేదు. సీఎం చంద్ర‌బాబు నామినేటెడ్ ప‌ద‌వుల భ‌ర్తీపై కాన్‌సంట్రేస న్ చేసిన‌ట్టు తెలుస్తోంది. ఈ క్ర‌మంలోనే దీనిపై క‌స‌ర‌త్తులు న‌డుస్తున్నాయి. ఇక కీల‌క‌మైన టీటీడీ చైర్మన్ గా టీవీ 5 అధినేత బి.ఆర్ నాయుడు /  సుప్రీం కోర్ట్ మాజీ చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ ల‌లో ఎవ‌రో ఒక‌రు ఈ ప‌ద‌వికి ఎంపిక కానున్నార‌ని టాక్ ?


ఇక కీల‌క‌మైన మహిళా కమిషన్ చైర్మన్ గా చంద్రగిరి ఎంఎల్ఏ పులవర్తి నాని సతీమణి సుధారెడ్డికి అవకాశాలు ఉన్నాయంటున్నారు. పులివ‌ర్తి నాని క‌మ్మ సామాజిక వ‌ర్గానికి చెందిన వారు కాగా.. ఆమె భార్య సుధారెడ్డి రెడ్డి సామాజిక వ‌ర్గానికి చెందిన వారు. ఇక మాజీ మంత్రి .. పార్టీ కీల‌క నేత‌.. ఈ ఎన్నిక‌ల్లో ఏకంగా త‌న అసెంబ్లీ సీటు సైతం త్యాగం చేసిన మాజీ మంత్రి దేవినేని ఉమా మ‌హేశ్వ‌ర రావుకు కీల‌క‌మైన
ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ ప‌ద‌వి ద‌క్క‌నుందంటున్నారు.


ఏపీఐఐసీ ( ఆంధ్ర ప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ) చైర్మన్ గా కడప జిల్లాకు చెందిన ప్రవీణ్ కుమార్ రెడ్డి పేరు దాదాపు క‌రారు అయిన‌ట్టే. ఆయ‌న ప్రొద్దుటూరు సీటు త్యాగం చేశారు. ఇక ఫుడ్ కమిషన్ చైర్మన్ గా టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి  పట్టాభి రామ్ పేరు లైన్లో ఉంది. ఇక ఎస్సీ కమిషన్ చైర్మన్ గా మాజీ మంత్రి పీతల సుజాత కు లైన్ క్లీయ‌ర్ అయ్యిందంటున్నారు. ఎస్టీ  కమిషన్ చైర్మన్ గా  మాజీ మంత్రి కిడారి శ్రావణ్ కుమార్ పేరు వినిపిస్తోంది. అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ ( ADC ) చైర్మన్ గా మాజీ మంత్రి ఆలపాటి రాజా పేరు దాదాపు ఖరారైనట్టు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: