ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరోసారి ఎన్నికల హడావిడి కొనసాగనుంది. మొన్నటి వరకు ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు రాజ్యసభ స్థానానికి సంబంధించిన ఉపఎన్నిక షెడ్యూల్ వచ్చేసింది... ఏపీలోని రాజ్యసభ ఎంపీ స్థానం ఉప ఎన్నికకు తాజాగా కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ రిలీజ్ చేసింది. ఇటీవల వైసిపి పార్టీకి సంబంధించిన మాజీ నాయకులు విజయసాయిరెడ్డి రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.


ఈ తరుణంలోనే రాజ్యసభ స్థానం ఖాళీ అయింది. అయితే విజయ్ సాయి రెడ్డి కారణంగా ఖాళీ అయిన ఆ రాజ్యసభ స్థానానికి ఎన్నిక నిర్వహించేందుకు రంగం సిద్ధం చేసింది కేంద్ర ఎన్నికల సంఘం.  ఇవాళ ఈ ఎన్నికకు సంబంధించిన షెడ్యూల్ విడుదల చేసింది ఎన్నికల సంఘం.  ఇక కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకారం.. ఈనెల 22వ తేదీన  నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది.  

 ఈనెల 22వ తేదీ నుంచి 29వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుందని అధికారులు ప్రకటించారు. ఇక ఈనెల 30వ తేదీన నామినేషన్ల పరిశీలన ఉంటుంది. మే రెండో తేదీన నామినేషన్లను ఉపసంహరించుకునేందుకు అవకాశం కల్పిస్తారు. ఇక ఈ రాజ్యసభ స్థానానికి సంబంధించిన ఎన్నిక మే తొమ్మిదవ తేదీన... జరుగుతుంది. అదే రోజున రిజల్ట్ కూడా ప్రకటిస్తారు అన్న సంగతి తెలిసిందే.

 ప్రస్తుతం ఉన్న బలం ప్రకారం కూటమి ఈ సీటును దక్కించుకుంటుంది. ఇది ఇలా ఉండగా.. ఈ రాజ్యసభ.. సీటు కోసం కూటమిలో ఉన్న అన్ని పార్టీలు ట్రై చేస్తున్నాయి. చిరంజీవికి వస్తుందని కొందరు అంటుంటే... అశోక్ గజపతి లాంటి వారికి వస్తుందని మరి కొంతమంది చెబుతున్నారు. ఇది ఇలా ఉండగా... విజయ్ సాయి రెడ్డి ఇటీవల వైసిపి పార్టీతో పాటు రాజ్యసభ స్థానానికి కూడా రాజీనామా చేశారు.  పూర్తిగా రాజకీయాలకు దూరంగా ఉంటానని విజయసాయిరెడ్డి ప్రకటించారు. అయినప్పటికీ విజయసాయి రెడ్డికి రాజ్యసభ టికెట్ వస్తుందని ప్రచారం జోరుగా సాగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: