
అయితే నిన్నటి రోజున ఒక్కరోజు 30 కి పైగా ప్రాంతాలలో సోదాలు చేసినట్లు తెలుస్తోంది. ఉగ్రవాదులకు మద్దతు ఇచ్చిన వారందరి పైన కూడా దాడులు చేస్తూ సహకరిస్తున్న వారందరిని పట్టుకోవడంలో అన్ని రాష్ట్ర పోలీసులు కూడా ప్రత్యేకమైన దృష్టి సాధించినట్లు తెలుస్తోంది. ఉగ్రవాద సంస్థలు చట్ట విరుద్ధమైన కార్యకలాపాలకు పాల్పడిన వారికి తీవ్రంగా శిక్ష ఉంటుందని అధికారులు తెలియజేస్తున్నారు. ఉగ్రదాడి జరిగిన రోజు నుంచి ఇప్పటివరకు వందమందికి పైగా ఇల్లల్లో తనిఖీలు చేపట్టారు.
తాజాగా జమ్మూ కాశ్మీర్లోనే ఉగ్రవాదులకు సంబంధించిన 31 ఇళ్లల్లో శోదాలు సైతం పోలీసులు చేయగా.. ఇందులో ఆయుధాలు, డిజిటల్ పరికరాలతో పాటు అందుకు సంబంధించిన పత్రాలను కూడా కొన్నిటిని స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే సాక్షి సమక్షంలో ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్స్ సోదాలు జరిపినట్లు అధికారులు తెలియజేశారు.. ముఖ్యంగా నిందితుడిగా ఉన్న అమీర్ అహ్మద్ గోర్జి ఇంట్లో కూడా పోలీసులు సైతం తనిఖీలు చేయగా ఉగ్రవాదులకు సంబంధించిన పరికరాలు సప్లై చేసేవారన్నట్లుగా అధికారులు తెలుసుకుని వెళ్లే వారన్నట్లుగా అధికారులు తెలియజేస్తున్నారు. ఇక రాబోయే రోజుల్లో మరింతగా అన్ని రాష్ట్రాలలో కూడా ప్రత్యేకించి మరి పోలీసులతో తనిఖీలు చేయించబోతున్నట్లు తెలియజేస్తున్నారు. ఎవరైనా సరే ఉగ్రవాదులకు సహాయం చేస్తే సహించేది లేదు అంటూ హెచ్చరిస్తోంది ఇండియా.