ఆపరేషన్ సింధూర్‌ పేరుతో పహల్గాం ఘటనపై భారత్ ప్రతీకారం తీర్చుకుంటున్న సంగతి తెలిసిందే. పాకిస్థాన్లోని ఉగ్రవాద స్థావరాలను నేలమట్టం చేయటమే లక్ష్యంగా భారత్ ఈ దాడులు చేస్తుంది. ఈ దాడుల్లో ఇప్పటికే వందమంది పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు చనిపోయిన విషయం తెలిసిందే. చనిపోయిన వరిలో కరుడుగట్టిన ఉగ్రవాదులు కూడా ఉన్నారు. భారత్ ఉగ్ర వాదుల స్థావ‌రాలపై దాడులు చేయడంతో పాకిస్తాన్ రెచ్చిపోతుంది. భారత్‌ పై ఎప్పుడు ? ఎలా దాడి చేయాలా ? అని పక్కా ప్రణాళికలతో రచిస్తోంది. ఇంతకు ఇంత ప్రతీకారం తీర్చుకుంటున్నాం ? అని కూడా పాకిస్తాన్ ప్రభుత్వంలో ఉన్న అధికారులు అందరూ చెబుతున్నారు. బుధవారం రాత్రి ఏకంగా 15 నగరాల్లోని ఆర్మీ స్థావరాలపై దాడులు చేయాలని పాకిస్థాన్ ప్రయత్నించింది.


చైనాకు చెందిన బి.వి.ఆర్ మిస్సైల్ తో పాకిస్తాన్ దాడి చేసేందుకు ప్రయత్నించగా భారత్ ఎస్ 400 ఎయిర్ డిఫెన్స్ తో దానిని సమర్థవంతంగా తిప్పికొట్టింది. మనదేశంలోని 15 నగరాలను పాకిస్తాన్ టార్గెట్గా పెట్టుకున్నట్టు కనిపిస్తోంది. బట్టిండా - జమ్మూ శ్రీనగర్ - అమృత్సర్ - పఠాన్ కోట్ - లుధియానా - జలంధర్ - భుజ్ - అవంతిపుర - చండీగఢ్ బలోఢీ తో పాటు పలు నగరాలపై దాడులకు పాల్పడింది. అయితే భారత సైన్యం సమర్థవంతంగా అడ్డుకోవడంతో ఎలాంటి నష్టం జరగలేదు. మరోవైపు సరిహద్దుల్లో కూడా నిరంతర కాల్పులు జరుగుతూనే ఉంది. వాటిని భారత సైన్యం తిప్పి కొడుతోంది.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: