ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైసీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గడిచిన కొద్ది రోజుల క్రితం రైతులకు ఇచ్చిన మాట ఏమిటంటే ఆంధ్రప్రదేశ్లో మార్చి నెలలో కురిసిన ఆకాల వర్షాలకు రైతులు సైతం తీవ్రస్థాయిలో నష్టపోయారు ముఖ్యంగా తమ సొంత నియోజకవర్గం పులివెందులలో కురిసిన వర్షాలకు కారణంగా వడగండ్ల వాన కారణంగా అరటి రైతులు చాలా దెబ్బతినడంతో పంట నష్టపోయిన రైతులకు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పరామర్శించి మరి పులివెందుల నియోజకవర్గం లో తిరగడం జరిగింది. అయితే ఆ సమయంలో రైతులకు సైతం ఆదుకుంటానని హామీ కూడా ఇచ్చారు. అలాగే ఆర్థిక సహాయాన్ని కూడా ప్రకటించడం జరిగింది.


ఇచ్చిన మాట ప్రకారం 670 మంది రైతులకు గాను వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆర్థిక సహాయాన్ని అందించారు. ఈ మేరకు సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తూ హెక్టార్కు 20వేల చొప్పున 670 మంది రైతులకు..1.14 కోట్ల రూపాయలు ఆర్థిక సహాయాన్ని మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి అందించినట్లుగా తెలియజేశారు. అధికారం లేకపోయినా అన్నదాతలకు ఇచ్చిన మాట ప్రకారం నిలబెట్టుకున్నారని వైసీపీ తమ ట్విట్టర్ ద్వారా తెలియజేసింది.. దీంతో పలువురు కార్యకర్తలు అధికార ప్రభుత్వం చేయలేని పని జగన్ చేసి చూపించారంటూ తెలియజేస్తున్నారు.

అలాగే వైసిపి అధినేత జగన్ కూడా సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గంలో అమరుడైన ఆర్మీ జవాన్ మురళి నాయక్ కుటుంబాన్ని పరామర్శించడానికి మే 13వ తేదీన వెళ్ళబోతున్నారు. ఆ తర్వాత మధ్యాహ్నం 12:30 నిమిషాలకు తిరిగి వెళ్ళబోతున్నారట. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి మురళి నాయక్ కుటుంబ సభ్యులను ఫోన్లో కూడా మాట్లాడి పరామర్శించినట్లు తెలుస్తోంది. అతని కుటుంబ సభ్యులకు ధైర్యాన్ని కూడా తెలియజేశారు మాజీ సీఎం జగన్. మొత్తానికి జగన్ ఇచ్చిన మాట ప్రకారమే రైతులకు చేసిన సహాయం ఇప్పుడు వైరల్ గా మారుతున్నది. మరి రాబోయే రోజుల్లో ఏంటా అన్నది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: