భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న సందర్భంగా  ఇరుదేశాలు ఒకరికి ఒకరు బాంబులు, మిససైల్స్ వేసుకొని యుద్ధాన్ని కొనసాగించారు. ముఖ్యంగా పాకిస్తాన్ వేసిన డ్రోన్, మిస్సైల్ లను ఇండియా సమర్థవంతంగా తిప్పి కొట్టిందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విధంగా ఆపరేషన్ సిందూర్ కొనసాగుతున్న సమయం లో అమెరికా మధ్య లోకి ఎంట్రీ ఇచ్చి యుద్ధాన్ని ఆపేలా మధ్యవర్తిత్వం చేసింది.. యుద్ధం ఆగినా కానీ  పాకిస్తాన్ మాత్రం తన వక్ర బుద్ధి ని మార్చుకోలేదు. కాల్పుల ఉల్లంఘనను తరచూ ఉల్లంఘిస్తూ  భారత్ పై దాడి చేస్తూనే వచ్చింది. ఇదే తరుణంలో పాక్ మంత్రులు సంబరాలు చేసుకుంటున్న సమయంలో మేము కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించలేదని చెప్పుకొస్తున్నారు. కానీ తాజాగా పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అహ్మద్ షరీఫ్ చౌదరి స్పందించారు.

 పాకిస్తాన్ ఎప్పుడు కూడా కాల్పుల విరమణ కోసం అభ్యర్థించలేదని, భారతదేశమే కాల్పుల విరమణకు  పిలుపునిచ్చిందని  ఆయన తెలిపారు. 6, 7 తేదీల్లో పాక్ పై భారత్ విచక్షణా రహితంగా, పిరికితనంతో కూడిన దాడులు జరిపారని  తెలిపారు. ఆ తర్వాత ఇండియా సీజ్ ఫైర్ కోసం అభ్యర్థించిందని, మేము ప్రతి దాడులు చేశాకే మాట్లాడతామని చెప్పామన్నారు. అలా మే 10 వ తేదీన సీజ్ ఫైర్ కు అంగీకరించామని తెలియజేశారు. ఇండియా చేసిన దాడులకు ప్రతీకారం తీర్చుకుంటామని అహ్మద్ షరీఫ్ చౌదరి చెప్పుకొచ్చారు.

 ఇప్పటికే ఇండియాలోని 26 సైనిక స్థావరాలను ధ్వంసం చేశామని, ఢిల్లీ తో సహా ఇతర నగరాలకు డ్రోన్లు పంపి దాడులు చేశామని తెలియజేశారు.  ఈ విధంగా పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ సీజ్ ఫైర్ గురించి సంచలన వ్యాఖ్యలు చేయడంతో సోషల్ మీడియాలో పాక్ ఆర్మీ చీఫ్ మాట్లాడిన మాటలు విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఈ వ్యాఖ్యలను విన్నటువంటి ఇండియన్ నెటిజన్స్ రకరకాలగా స్పందిస్తూ ఫన్నీ కామెంట్స్ పెడుతూ నవ్వుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: