సోషల్ మీడియాలో ఇప్పుడు ఒకటే రచ్చ. ఏంటనుకుంటున్నావా? మన మహారాష్ట్ర పోలీసులు బాలీవుడ్ స్టార్లకి ఇచ్చిన ఒక సాలిడ్ సెటైర్ ఇప్పుడు వైరల్ అవుతోంది. అసలే ఇండియా-పాకిస్తాన్ మధ్య వేడి రాజుకుంటున్న టైమ్ ఇది. దేశం మొత్తం ఒక దారుణ ఘటనపై ఆగ్రహంతో రగిలిపోతుంటే, మన సౌత్ ఇండియా స్టార్లు మాత్రం ధైర్యంగా ముందుకొచ్చి, తమ గళం విప్పారు, ఖండించారు.

కానీ, బాలీవుడ్ పెద్ద తలకాయల సంగతి ఏంటి? అక్షయ్ కుమార్ అన్న ఒక్కడు తప్పించి, మిగతా మహామహులు అయిన షారుఖ్ ఖాన్, అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్, రణ్‌వీర్ సింగ్, రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్, దీపికా పదుకొణె వీళ్లంతా కనీసం చీమ కుట్టినట్టయినా ప్రవర్తించలేదు. ఒక్క మాట లేదు, ఒక్క పోస్ట్ లేదు. దీంతో నెటిజన్లకు ఒళ్లు మండింది. "మీ ప్రయారిటీలు ఏంటి? మీ దేశభక్తి ఇదేనా?" అంటూ సోషల్ మీడియాలో ఏకిపారేశారు.

ఈ టైంలోనే మహారాష్ట్ర పోలీసులు సీన్‌లోకి ఎంట్రీ ఇచ్చారు, అదీ మామూలుగా కాదు. బాలీవుడ్ స్టార్ల AI జనరేటెడ్ ఫోటోలు పెట్టి, ఒక ఘాటైన కామెంట్ తగిలించారు. "ప్రియమైన సెలబ్రిటీల్లారా, ఇప్పుడు అంతా సేఫ్. మీ ఇన్స్‌స్టాగ్రామ్‌లకు తిరిగి రావచ్చు. మీ అంతర్జాతీయ ఫ్యాన్స్ గురించి ఇక చింతించకండి." అని పోస్ట్ పెట్టారు. వాళ్ల మౌనాన్ని సూటిగా, సుత్తిలేకుండా గుచ్చినట్టుంది. ఆ పోస్ట్ చివర్లో "బాలీవుడ్ గొంతు ఎక్కడ?" అని ఒక ప్రశ్న కూడా తగిలించారు. ఇంకేముంది, దెబ్బకు పోస్ట్ వైరలైంది. ముఖ్యంగా నార్త్ ఇండియన్ ఆడియన్స్ షేర్లు, కామెంట్లు, చర్చలతో హోరెత్తించారు.




మామూలుగా అయితే ఉమంగ్ ఫెస్టివల్ లాంటి వాటితో సెలబ్రిటీలతో ఫ్రెండ్లీగా ఉండే మహారాష్ట్ర పోలీసులు, ఇలా ఒక్కసారిగా షాక్ ఇవ్వడంతో నెటిజన్లు కూడా అవాక్కయ్యారు. చాలామంది, "భలే ఇచ్చిపడేశారు పోలీసుల వాళ్లు. ఇండియన్ ఆడియన్స్‌తో కోట్లు దండుకునే ఈ బాలీవుడ్ బ్యాచ్, దేశానికి ఏదైనా కీలక సమస్య వస్తే మాత్రం నోరు మెదపరు. వీళ్లకు ఇప్పుడు సరిగ్గా బుద్ధి వచ్చింది" అని అంటున్నారు. పోలీసుల పోస్ట్ ఇప్పుడు జనాల ఆవేశానికి, అసహనానికి ఒక పవర్‌ఫుల్ సింబల్‌గా మారింది. సెలబ్రిటీలకు వాళ్ల సోషల్ రెస్పాన్సిబిలిటీని గుర్తుచేసిన ఒక "మస్ట్ వాచ్" రిమైండర్ ఇది.

మరింత సమాచారం తెలుసుకోండి: