అమెరికాలో పోర్న్‌హబ్ లాంటి పెద్దలకు మాత్రమే వెబ్‌సైట్లు ఇకపై కనిపించకపోవచ్చు. ఎందుకంటే, అక్కడి కాంగ్రెస్‌లో "ఇంటర్‌స్టేట్ అబ్‌సీనిటీ డెఫినిషన్ యాక్ట్" (IODA) అనే ఓ కొత్త బిల్లును ప్రవేశపెట్టారు. దీన్ని రిపబ్లికన్ పార్టీకి చెందిన సెనేటర్ మైక్ లీ (ఉటా రాష్ట్రం) ముందుకు తీసుకురాగా, ప్రతినిధి మేరీ మిల్లర్ (ఇల్లినాయిస్ రాష్ట్రం) మద్దతు పలికారు. ఈ బిల్లు గనుక చట్టంగా మారితే, అమెరికాలో సెక్సువల్ కంటెంట్ విషయంలో, ముఖ్యంగా ఇంటర్నెట్‌లో పెను మార్పులు రావడం ఖాయం.

ఇంతకీ ఇప్పుడున్న రూల్స్ ఏంటి.. "అశ్లీలం" అంటే ఏంటో చెప్పడానికి 1973లో సుప్రీం కోర్టు "మిల్లర్ వర్సెస్ కాలిఫోర్నియా" కేసులో కొన్ని గైడ్‌లైన్స్ ఇచ్చింది. దాని ప్రకారం, ఒక కంటెంట్ అశ్లీలమైనదిగా చెప్పాలంటే అది లైంగిక ఆసక్తిని (ప్రురియంట్ ఇంట్రెస్ట్) రేకెత్తించేలా ఉండాలి. ప్రస్తుత సమాజపు విలువలకు వ్యతిరేకంగా ఉండాలి. దానికి ఎలాంటి సాహిత్య, కళాత్మక, రాజకీయ, లేదా శాస్త్రీయ విలువ ఉండకూడదు.

ఈ కొత్త బిల్లు ఈ డెఫినేషన్‌నే మార్చేయాలని చూస్తోంది. "సమాజపు విలువలు", "కళాత్మక విలువ" లాంటి చెక్ పాయింట్స్‌ని తీసేసి, సింపుల్‌గా నగ్నత్వం, సెక్స్, లేదా శారీరక భాగాలపై ఫోకస్ చేస్తూ, జనాలను రెచ్చగొట్టేలా ఉంటే చాలు, దాన్ని అశ్లీలమైనదిగా పరిగణిస్తారట. అంటే, కొందరు చదువుకోవడానికి పనికొస్తుందనో, కళాత్మకమైనదనో అనుకునే కంటెంట్ కూడా ఇకపై బ్యాన్ అయ్యే ఛాన్స్ ఉంది.

ఇందులో ఇంకో పెద్ద ట్విస్ట్ ఏంటంటే, ప్రస్తుత చట్టంలో ఉన్న "ఉద్దేశం" అనే క్లాజ్‌ను ఈ బిల్లు తీసేస్తుంది. అంటే, వెబ్‌సైట్లు లేదా కంటెంట్ తయారుచేసేవాళ్లు కావాలని అశ్లీల మెటీరియల్ షేర్ చేయకపోయినా సరే, వాళ్లపై చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందన్నమాట. ఇది చాలా పెద్ద మార్పు.

సెనేటర్ మైక్ లీ ఎక్స్‌లో తన వాదన వినిపించారు. "అశ్లీలతకు రాజ్యాంగంలోని మొదటి సవరణ రక్షణ ఇవ్వదు. బలహీనంగా, గందరగోళంగా ఉన్న చట్టాల వల్ల పోర్న్ కంపెనీలు హానికరమైన కంటెంట్‌ను వ్యాప్తి చేస్తున్నాయి, పిల్లల వరకు తీసుకెళ్తున్నాయి, రాష్ట్రాల మధ్య ఎలాంటి అడ్డంకులు లేకుండా పనిచేస్తున్నాయి" అని ఆయన అన్నారు.

ఒకవేళ ఈ IODA బిల్లు పాస్ అయితే, పోర్న్‌హబ్‌తో సహా చాలా అడల్ట్ వెబ్‌సైట్లు అమెరికా మొత్తం మీద బ్యాన్ అవ్వొచ్చు. దేశవ్యాప్తంగా ఆన్‌లైన్ కంటెంట్ రూల్స్‌పై కూడా దీని ప్రభావం గట్టిగానే ఉంటుంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.

మరింత సమాచారం తెలుసుకోండి: