ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోని తెలుగు దేశం కూటమి ప్రభుత్వం.. వరుస నిర్ణయాలు తీసుకుంటూ... ముందుకు సాగుతోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో.. సంక్షేమ పథకాలను అమలు చేసే విధంగా దూసుకు వెళ్తోంది. అన్ని వర్గాల ప్రజలను... సంతృప్తి చేస్తూ, దూకుడు చూపిస్తోంది. ఇలాంటి నేపథ్యం లోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్ర లో సరికొత్త నిర్ణయానికి నాంది పలికింది చంద్రబాబు కూటమి ప్రభుత్వం. తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో ఉన్న ట్రాన్స్ జెండర్లకు రేషన్ కార్డులు ఇచ్చేందుకు నిర్ణయం తీసుకుంది.

 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర  చరిత్ర లో... ఇది వరకు ఎవరు చేయని సాహసమే చేస్తూ... ఏపీలో ఉన్న ట్రాన్స్ జెండర్లకు రేషన్ కార్డులు జారీ చేస్తున్నట్లు తాజాగా ప్రకటన విడుదల చేసింది. కాకినాడలో తాజాగా జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఓ కీలక సమావేశం జరిగిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ సంస్థ చైర్మన్ తోట సుధీర్... ట్రాన్స్ జెండర్ లకు రేషన్ కార్డులు ఇవ్వబోతున్నట్లు ప్రకటన చేశాడు.

 గతంలో ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇచ్చిన మాట ప్రకారం... ఇప్పుడు ట్రాన్స్ జెండర్లకు రేషన్ కార్డులు ఇస్తున్నట్లు వివరించాడు. ట్రాన్స్ జెండర్లకు న్యాయం చేసేందుకుగాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పుకొచ్చాడు. అయితే రేషన్ కార్డులు ట్రాన్స్ జెండర్ లకు ఇస్తున్న నేపథ్యంలో.. ఏపీ ప్రభుత్వంపై ప్రశంసల వర్షం కురుస్తుంది. ఇలాంటి నిర్ణయాలు మరిన్ని తీసుకోవాలని... జనాల నుంచి సానుకూలత వస్తుంది.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లా లో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ : వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: