
అందుకే వారు జూన్ 1వ తేదీ నుంచి థియేటర్లను మూసి వేయబోతున్నామంటూ నిర్మాతల మండలికి ఒక లేఖ ద్వారా తెలిపారు. అయితే ఈ సమస్యను పరిష్కరించుకునేందుకు.. తెలుగు ఫిలిం ఛాంబర్లో ఒక సమావేశమయ్యారు. ఇందులో టాలీవుడ్ డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతలు కూడా వచ్చారట. ఉదయం ఒకరు సాయంత్రం ఒకరుగా రెండు విడతలుగా ఈ సమావేశాన్ని చేశారు. అయితే ఇక్కడే ఉమ్మడిగా తీసుకొనే నిర్ణయం ఏమిటంటే సమ్మె లాంటి వాటికి వెళ్లకుండా థియేటర్లను నడిపిస్తూనే సమస్యను పరిష్కరించుకోవాలని సూచించారు.
గతంలో లాగా షూటింగ్ ఆపివేసిన, థియేటర్లు మూసివేసిన ఉపయోగం లేదని.. సంయమనం పాటించాలంటూ తెలియజేశారట. అంతేకాకుండా జూన్ నెలలో బడా సినిమాలు కూడా రిలీజ్ కావడంతో ఇప్పుడు థియేటర్లు మూసేస్తే చాలా నష్టం వాటిల్లుతుందని.. అయితే ఈ నేపథ్యంలోనే డిస్ట్రిబ్యూటర్లు పెట్టిన డిమాండ్ల పరంగా కొంతమంది నిర్మాతలు కూడా అసంతృప్తిని వెల్లడించారు. రెంటల్ పద్ధతిని మార్చి.. షేరింగ్ బేస్ మోడల్ లో ప్రవేశపెట్టాలంటు సూచించడంతో వీటి పైన అభ్యంతరాన్ని కూడా తెలియజేశారట. ఈ విషయం పైన ఛాంబర్ లో తీవ్రవాదనులు కూడా చోటుచేసుకున్నాయని సమాచారం. ఇలా ఇవన్నీ జరుగుతూ ఉన్న సమయంలో టాలీవుడ్ బడా నిర్మాత దగ్గుబాటి సురేష్ కోపంతో మధ్యలోనే హాలులో తలుపులు తన్నుకుంటూ బయటికి వెళ్లిపోయారని గుసగుసలు వినిపిస్తున్నాయి. షేరింగ్ బేస్ విధానం అభిప్రాయం నచ్చకపోవడం వల్ల ఇలా చేశారని రూమర్స్ అయితే వినిపిస్తున్నాయి.