
ఇలాంటి నేపథ్యంలో.. కవిత అంశంపై బీజేపీ నాయకులు లక్ష్మణ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. షర్మిల వాడుకొని... జగన్మోహన్ రెడ్డిని నాశనం చేసే కుట్రలు చేసింది కాంగ్రెస్ పార్టీ అంటూ సంచలన ఆరోపణలు చేశారు. అదే సమయంలో.. ఇప్పుడు కల్వకుంట్ల కవితను వాడుకొని... గులాబీ పార్టీని దెబ్బతీసే ప్రయత్నం జరుగుతోందని... బిజెపి నేత లక్ష్మణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ నాయకత్వం అంటే కల్వకుంట్ల కవితకు ఏమాత్రం ఇష్టం లేదని తెలుస్తోందని.. అందుకే తన అసంతృప్తిని బయటపెట్టిందని వెల్లడించారు.
గులాబీ పార్టీలో కల్వకుంట్ల కవితకు పెద్ద ప్రాధాన్యత లేదని.. ఆమె లిక్కర్ కేసులో దొరికిన వ్యక్తి అంటూ ఫైర్ అయ్యారు. అలాంటి వ్యక్తి ఇలా వ్యవహరిస్తే సానుభూతి ఏమాత్రం రాదని... ఈ విషయంలో కెసిఆర్ హవా కొనసాగుతుందని వెల్లడించారు. ఎంపీ సీట్ కూడా గెలవని కల్వకుంట్ల కవిత... ఎన్నడూ లేని విధంగా సామాన్యుల్లో గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. గత 10 సంవత్సరాల లో కేసీఆర్ ను ఎప్పుడూ ఎందుకు ప్రశ్నించలేదు... అంటూ నిలదీశారు బిజెపి నేత లక్ష్మణ్.
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు