తెలంగాణ రాష్ట్రంలో  రాజకీయాలు మొత్తం గులాబీ పార్టీ ఎమ్మెల్సీ  కల్వకుంట్ల కవిత చుట్టే తిరుగుతున్న సంగతి తెలిసిందే. కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు కల్వకుంట్ల కవిత లేఖ రాయడంతో... ఈ రచ్చ నెలకుంది. కెసిఆర్ నిర్ణయాలు చాలా తప్పిదాలు ఉన్నాయని... గులాబీ పార్టీలో పరిస్థితులు బాగా లేవని ఆమె చెప్పకనే చెప్పారు. దీంతో కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ పెట్టబోతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. కేటీఆర్ అలాగే హరీష్ రావు  నాయకత్వం నచ్చక బయటికి వస్తున్నారని ప్రచారం చేస్తున్నారు.

 అయితే ఇలాంటి నేపథ్యంలో.. కల్వకుంట్ల కవిత గురించి ఓ బ్లాస్టింగ్ న్యూస్ తెరపైకి వచ్చింది. కల్వకుంట్ల కవిత త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు  సిద్ధమైనట్లు వార్త వార్త వైరల్ అవుతుంది. ఆంధ్రజ్యోతి కి సంబంధించిన   పత్రికలో.. కల్వకుంట్ల కవిత కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని.. ప్రత్యేక స్టోరీ వచ్చింది. ఈ విషయం మధ్యవర్తుల ద్వారా కాంగ్రెస్ అధిష్టానానికి తీసుకు వెళ్లినట్లు.. ఇందులో పేర్కొన్నారు.

 ఇటీవల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అలాగే పిసిసి మహేష్ గౌడ్.. ఇద్దరు కూడా కాంగ్రెస్ అధిష్టానానికి ఈ అంశాన్ని  చేర్చినట్లు.. ఈ ప్రత్యేక కథనంలో రాసుకోవచ్చారు. అయితే ప్రస్తుత పరిస్థితులలో కవితను పార్టీలోకి తీసుకోవడం.... సరికాదని కూడా... కథనంలో స్పష్టంగా ఉంది. కల్వకుంట్ల కవితను పార్టీలో చేర్చుకుంటే... కాంగ్రెస్ వాటికి నష్టం తప్ప లాభమేమి ఉండదని చెప్పే ప్రయత్నం చేశారు. ఇప్పుడు ఈ కథనం సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతోంది. మరి దీనిపై కల్వకుంట్ల కవిత ఎలా స్పందిస్తారో చూడాలి.




వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ : వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: