కల్వకుంట్ల కవిత గత కొద్ది రోజుల క్రితం కేసీఆర్ కి రాసిన లేఖ పెద్ద వివాదంగా మారింది. కవిత తన తండ్రికి లేఖ ద్వారా గులాబీ పార్టీకి సంబంధించిన కొన్ని విషయాలను తెలియజేశారు. ఒకప్పటి లాగా బీఆర్ఎస్ పార్టీ లేదని అన్నారు. గులాబీ పార్టీ బిజెపి పార్టీ కలిసిపోయిందని చాలామంది అనుకుంటున్నట్లుగా కవిత వెల్లడించారు. వరంగల్ లో ఏర్పాటు చేసిన సభలో కూడా మీరు కొన్ని తప్పులు చేశారని కవిత అన్నారు. అంతేకాకుండా మీ చుట్టూ కొన్ని దయ్యాలు తిరుగుతున్నాయని కవిత హాట్ కామెంట్స్ చేశారు. వాటి వల్ల అనేక అనర్ధాలు సంభవిస్తాయని కవిత అన్నారు.


కవిత రాసిన లేఖ పైన కేటీఆర్ సీరియస్ కూడా అయ్యారు. బీఆర్ఎస్ పార్టీలో కవిత చేసిన విధంగా తప్పిదాలను లేఖ రూపంలో రాసి బయట పెట్టవద్దని కేటీఆర్ చెప్పాడు. అనంతరం కవిత ఇలా మాట్లాడడంతో బీఆర్ఎస్ పార్టీ నుంచి కవితను సస్పెండ్ చేస్తారని చాలామంది నేతలు అభిప్రాయపడ్డారు. ఈ క్రమంలోనే తాజాగా కవిత చిట్ చాట్ లో మాట్లాడారు. తాను లిక్కర్ స్కామ్ లో జైలుకు వెళ్లిన సమయంలో బిజెపి పార్టీలో గులాబీ పార్టీని విలీనం చేసే కుట్రలు జరిగాయి అంటూ కవిత అన్నారు. కేటీఆర్ తనను బయటకు పంపించలేదని కవిత చెప్పారు.

 కెసిఆర్ తన రియల్ హీరో అని కవిత అన్నారు. నన్ను బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎవరు బయటికి వెళ్ళగొట్టలేరని అంత సీన్ ఎవరికీ లేదని కవిత హాట్ కామెంట్స్ చేశారు. అయితే కల్వకుంట్ల కవిత తాజాగా చేసిన కామెంట్లపై కేసీఆర్ మరోసారి ఫైర్ అయ్యారట. ఈరోజు సాయంత్రం లోపు కవితను సస్పెండ్ చేసే అవకాశాలు ఉన్నాయని ప్రచారాలు కొనసాగుతున్నాయి. బీఆర్ఎస్ పార్టీ నుంచి కవితను సస్పెండ్ చేస్తారా లేదా అనే సందేహంలో చాలామంది నేతలు ఉన్నారు. ఈ విషయం పైన మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: