
తాజాగా రీవాల్యుయేషన్ కి సంబంధించి ఒక స్టేట్మెంట్ ని ఇచ్చింది షర్మిల. పదవ తరగతి ఫలితాలు రీవాల్యుయేషన్ మీద ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్, వైసిపి పార్టీ అధినేత మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి మధ్య వాదనలు చూస్తూ ఉంటే.. దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నాయన్నట్లుగా ఏపీసి అధ్యక్షురాలు షర్మిల ఎద్దేవ చేయడం జరిగింది. ఆదివారం రోజున ట్విట్టర్ వేదికగా ఒక ట్విట్ చేశారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ప్రతి ఏటా కూడా రీకౌంటింగ్ లో ఫెయిల్ అయిన 20 శాతం మంది విద్యార్థులు తిరిగి మళ్ళి అధిక మార్కులతో పాసయ్యారని తెలిపింది.
ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో 30 వేల మందిలో 11,000 మందికి తిరిగి ఫస్ట్ క్లాస్ మార్కులు వచ్చాయి.. పేపర్లు తిక్కడంలో ఎంత చిత్తశుద్ధి ఉందో అర్థం అవుతుంది. విద్యార్థి జీవితాలతో ఆడుకుంటూ విద్యా వ్యవస్థను సైతం బ్రష్టు పట్టిస్తున్నారని.. అందుకు నిదర్శనం ఇదే అంటూ తెలిపింది... వాస్తవానికి ఫెయిల్ అయ్యింది విద్యార్థులు కాదు.. పేపర్లు దిద్దలేనటువంటి వైసిపి, కూటమి ప్రభుత్వాలు ఫెయిల్ అయ్యింది. విద్యాశాఖ మంత్రిగా లోకేష్ ఫెయిల్ అయినట్టే అంటూ వీటి మీద వెంటనే విచారణ చేపట్టాలంటు రాసుకుంది షర్మిల. విద్యార్థుల ప్రాణాలతో ఆటలాడుతున్నారు అంటే వెల్లడించింది. ఇదంతా కూడా ప్రభుత్వ వైఫల్యమే అంటూ రాసుకుంది షర్మిల.