అవును ప్రస్తుతం బీఆర్ఎస్ శ్రేణులు ఇదే విషయం గురించి చర్చించుకుంటున్నారు.. కేసీఆర్ దేవుడు కానీ ఆయన చుట్టూ దెయ్యాలు తిరుగుతున్నాయి అని కవిత మాట్లాడిన మాటలు నిజమే అనుకుంటున్నారు.ఎందుకంటే తాజాగా కేసీఆర్ ఫామ్ హౌస్ లో పల్లా రాజేశ్వర్ రెడ్డి బాత్రూంలో కాలు జారి పడడంతో ఈ చర్చ తెరమీద వినిపిస్తోంది.ఇక విషయంలోకి వెళ్తే.. తెలంగాణలో 2023 లో ఎలక్షన్స్ జరిగి కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించాక కేసీఆర్ ఫామ్ హౌస్ కే పరిమితమయ్యారు. అలా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కేసీఆర్ ఫామ్ హౌస్ లోని బాత్రూంలో కాలు జారి పడి తొంటి ఎముక విరిగిందని హాస్పిటల్లో చేర్పించారు.ఆ తర్వాత కొద్ది రోజులకు ఫామ్ హౌస్ కి వెళ్ళిన సబితా ఇంద్రారెడ్డి కూడా ఫుడ్ పాయిజనింగ్  కి గురైంది.

ఇక తాజాగా పల్లా రాజేశ్వర్ రెడ్డి కూడా కేసీఆర్ ఫామ్ హౌస్ కి వెళ్లి కేసీఆర్ ఎలా అయితే బాత్రూంలో కాలుజారి పడి తొంటి ఎముక విరగ్గొట్టుకున్నారో అచ్చం పల్లాకి కూడా అదే పరిస్థితి ఏర్పడింది. అయితే ఈ వరుస పరిణామాల నేపథ్యంలో చాలామంది బీఆర్ఎస్ శ్రేణుల్లో భయం పుచ్చుకుంది. కేసీఆర్ ఫామ్ హౌస్ లో ఏమైనా దుష్టశక్తులు ఉన్నాయా..ఎందుకు ఇలా ఫామ్ హౌస్ కి వెళ్ళిన వాళ్లందరికీ ఏదో ఒక ప్రమాదం జరుగుతుంది అని భయాందోళనకు గురవుతున్నారు. అంతేకాదు ఫామ్ హౌస్ కి వెళ్ళాలా వద్దా అని ఆలోచన చేస్తున్నారట. అయితే కేసీఆర్ తన ఫామ్ హౌస్ లో ఎప్పటికప్పుడు పూజలు నిర్వహిస్తూ ఉంటారు.ఇన్ని పూజలు చేసినా కూడా ఎందుకిలా జరుగుతుంది అని చాలామంది మాట్లాడుకుంటున్నారు. ఇక కొంతమందేమో అసలు కేసీఆర్ ఫామ్ హౌస్ లో దుష్టశక్తులు ఏమైనా తిరుగుతున్నాయా..లేక వాస్తు దోషమా..

అందుకే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయా..లేదా యాదృచ్ఛికంగా అలా జరుగుతుందా అంటూ మాట్లాడుకుంటున్నారు. ఇక కేసీఆర్ కుటుంబంలో కూడా కవిత కారణంగా విభేదాలు వచ్చిన సంగతి మనకు తెలిసిందే. కల్వకుంట్ల ఫ్యామిలీలో విభేదాలు రావడంతో ఫామ్ హౌస్ లో దుష్టశక్తులు అంటూ చాలామంది దీని గురించే గుసగుసలు పెట్టుకుంటున్నారు.. అంతేకాదు వాస్తు దోషమో లేక ఏదైనా దుష్ట శక్తులు ఉంటే వెంటనే దానికి సంబంధించి కేసీఆర్ పరిహార పూజలు చేయించాలని కూడా మాట్లాడుకుంటున్నారు.. మరి ఫామ్ హౌస్ లో నిజంగానే దుష్ట శక్తులు ఉన్నాయా లేక వాస్తు దోషమా లేకపోతే యాదృచ్ఛికంగా అలా జరిగిందా ఇందులో ఏది నిజం ఏది అబద్దం అని చాలామంది బీఆర్ఎస్ శ్రేణులు ఫామ్ హౌస్ కి వెళ్లడానికి వణికిపోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: