
కానీ, ఇప్పుడు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ పై ఆ ఆంక్షలు ఎత్తేశారు. గతంలో ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ (FATF) యుఎఇ ను గ్రే లిస్ట్ లో చేర్చింది. దాని తర్వాత యుఎఇ ప్రభుత్వం మనీలాండరింగ్, టెర్రరిజం ఫైనాన్సింగ్‌పై పోరాటానికి పలు సంస్కరణలు చేపట్టింది. ఈ సంస్కరణలు యూరోపియన్ యూనియన్ కు నచ్చేటట్లుగా ఉండటంతో, తాజాగా ఆ దేశాన్ని హై-రిస్క్ జాబితా నుంచి తొలగించారు. ఈ నిర్ణయంతో యుఎఇ అంతర్జాతీయ ఆర్థిక రంగంలో విశ్వసనీయతను మరింతగా బలోపేతం చేసుకుంది.
హై-రిస్క్ దేశాల జాబితా నుంచి యుఎఇకు విముక్తి లభించడంతో ఇది విదేశీ పెట్టుబడులు మరింతగా ఆకర్షించడానికి ఎంతగానో దోహదపడుతుంది. యూరప్ దేశాలతో సంబంధాలు మెరుగవుతాయి. అంతర్జాతీయ బ్యాంకులకు అరబ్ దేశాలపై నమ్మకం కూడా పెరుగుతుంది. అలాగే ఇండియాతో సహా అనేక దేశాలకు యుఎఇ ప్రధాన వ్యాపార భాగస్వామిగా ఉండడం వల్ల ఇయు తాజా నిర్ణయం ఆయా దేశాలకూ ప్రభావం చూపవచ్చని అంటున్నారు. కాగా, యుఎఇ తో పాటు బార్బడోస్, జిబ్రాల్టర్, జమైకా, పనామా, ఫిలిప్పీన్స్, సెనెగల్ మరియు ఉగాండాలను కూడా హై-రిస్క్ దేశాల జాబితా నుంచి యూరోపియన్ కమిషన్ తొలగించింది.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు