
ఈనెల 21వ తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా.. వీటిని ఎంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం చేపట్టింది. అంతేకాకుండా విశాఖలో యోగా డే నిర్వహించబోతున్నారు ఈ కార్యక్రమానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కూడా రాబోతున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రధాన మోడీ రాకకు రెండు రోజుల నుంచి భద్రతను వశిష్టం చేయబోతున్నారు. అంతేకాకుండా భారీ బందోబస్తు కూడా కల్పించబోతుండడంతో ఈ సందర్భంలో ఖచ్చితంగా పరీక్షలు పెడితే అభ్యర్థులకు ఇబ్బందులు తలెత్తుతాయని ఉద్దేశించి పోస్ట్ పోన్ చేసినట్లుగా తెలుస్తోంది. జూన్ 21న జరిగే యోగా దినోత్సవాన్ని ఏపీ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని మరి నిర్వహించబోతోంది.
అంతేకాకుండా రాష్ట్రవ్యాప్తంగా పోలీసుల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. పరీక్ష కేంద్రాలు పరీక్ష తేదీ మార్పులు చేసిన హాల్ టికెట్లు కూడా ఈ నెల 25వ తేదీ నుంచి అందుబాటులో ఉంటాయని తెలియజేశారు అందుకు సంబంధించి మెగా డీఎస్సీ కన్వీనర్ ఎంపీ కృష్ణారెడ్డి అన్ని వివరాలను తెలియజేశారు.. అందుకు సంబంధించి అధికారిక వెబ్సైట్ https://apdsc.apcfss.in లో అభ్యర్థులు మార్పులు చేసిన హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చని దీని ప్రకారమే పరీక్షలకు రావాలని తెలియజేశారు. ఏది ఏమైనా జూన్ 20, 21వ తేదీన రాసే అభ్యర్థులకు చదువుకోవడానికి మరో కొద్ది రోజులు సమయం దొరికిందని చెప్పవచ్చు.