ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి సర్కార్ కు ఊహించని షాకులు ఎదురవుతున్నాయి. రాష్ట్రంలో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చి ఏడాది అయిన సంగతి తెలిసిందే. అయితే ఏడాది కాలంలోనే కూటమి సర్కార్ పై వ్యతిరేకత పెరుగుతోందా అనే ప్రశ్నకు అవుననే సమాధానం వినిపిస్తోంది. కొన్ని రోజుల క్రితం బదిలీలకు సంబంధించి టీచర్లు వ్యతిరేకత కనబరిచిన సంగతి తెలిసిందే.

ప్రభుత్వ ఉద్యోగులు సైతం పీఆర్సీ విషయంలో తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు.  తాజాగా మున్సిపల్ ఔట్ సోర్సింగ్ కార్మికులు సమ్మెకు పిలుపునివ్వడం హాట్ టాపిక్ అవుతోంది.  రాష్ట్రంలోని అన్ని మున్సిపల్ కార్పొరేషన్లలో పని చేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు  ఈ నెల 22వ తేదీ నుంచి సమ్మెలోకి వెళ్లనున్నారని తెలుస్తోంది.  ఈ ఉద్యోగులకు సంబంధించిన అధ్యక్షుడు రఘుబాబు ఈ మేరకు ప్రకటన చేశారు.

ఎంతోకాలంగా జీతాలు పెంచాలని ప్రభుత్వానికి వినతి పత్రాలు ఇస్తున్నా  ప్రభుత్వం నుంచి సరైన స్పందన ఉండటం లేదని వాళ్ళు చెప్పుకొచ్చారు.  కార్మికుల న్యాయమైన కోరికలు తీర్చాలని యూనియన్ నాయకులు  కోరుతున్నారు.   ఇప్పటికే  రెండు సార్లు చర్చలు జరిగినా ఫలితం లేకుండా పోయిందని వాళ్ళు వాపోతున్నారు.  ఈ వివాదంలో ఎలాంటి మలుపులు చోటు చేసుకుంటాయో చూడాలి.

ప్రభుత్వం ఉద్యోగుల కోరికలను నెరవేరిస్తే  ఇతర ఉద్యోగులు సైతం ఈ దిశగా అడుగులు  వేసే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు.  కూటమి సర్కార్ ఉద్యోగులకు న్యాయం చేస్తుందా లేదా అనే చర్చ సైతం సోషల్ మీడియా వేదికగా జరుగుతోంది.  కూటమి సర్కార్  ప్రభుత్వ  పథకాలు సైతం  మున్సిపల్ కార్మికులకు అమలయ్యేలా  చూస్తోంది.  ఒకవేళ  జీతాలు పెంచితే భవిష్యత్తులో ఈ పథకాలు  అమలవుతాయా లేదా అనే చర్చ జరుగుతోంది.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: