దేశవ్యాప్తంగా జనాభా గణన చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వం రెడీ అవుతుంది .. ఇప్పటికే తీసుకున్న కేంద్ర క్యాబినెట్ నిర్ణయాలకు దేశవ్యాప్తంగా జన గణనలో భాగంగా  కుల గణన కూడా చేపట్టనున్నారు .. ఇక దేశంలో రెండు విడతలగా జనాభా గణన ప్రక్రియ మొదలు పెట్టనున్నారు .. ఇక వచ్చే ఏడాదికి కొన్ని రాష్ట్రాల్లో జన గణన మొదలుకానుండగా మిగతా రాష్ట్రాల్లో 2027 లో ఈ ప్రక్రియ మొదలు పెట్టనున్నారు .. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది.
 

దేశంలో మొదలు పెట్టే జన గణన ముందుగా వచ్చే ఏడాది అక్టోబర్ 1 అర్ధరాత్రి నుంచి కేంద్ర పాలిత ప్రాంతాలైన లడ‌ఖ్‌, జ‌మ్మూ కాశ్మీర్ తో పాటు హిమాచల్ ప్రదేశ్ , ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో చేయనున్నారు .. అలాగే 2027 మార్చ్ 1 నుంచి మిగిలిన రాష్ట్రాలు , కేంద్రపాలిత ప్రాంతాల్లో ఈ ప్రక్రియ జరగనుంది .. అదే విధంగా ప్రతి రాష్ట్రం లోనూ రెండు దశ‌ల్లో జనాభా గణన చేస్తారు .. అలాగే నిన్న జన గణన కమిషన్ రిజిస్టర్ జనరల్ తో ఈ విషయం పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమీక్ష కూడా నిర్వహించారు .  ఆ మీటింగ్ లో ఈ తేదీలను ఖరారు చేశారు .

జనాభా గణన‌లో భాగంగా ఏన్యూమరేటర్లు ఇంటింటికి వెళ్లి ముందుగా హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ చేపడతారు .. అందులో ప్రతి ఇంటి గృహ పరిస్థితులు ఆస్తులు సౌకర్యాలు గురించి ప్రతి సమాచారం తీసుకుంటారు .. ఆ తర్వాత రెండవ దశలో ప్రతి ఇంటికి వెళ్లి ప్రతి వ్యక్తి యొక్క జనాభా సామాజిక ఆర్థిక సంస్కృతిక వివరాలు తీసుకుంటారు .. ఈ దశలోనే ఆ వ్యక్తి యొక్క కులం గురించి కూడా సమాచారం తీసుకుంటారు .. మనదేశంలో ఎంతో సుదీర్ఘమైన విరామం తర్వాత ఇలా జనాభా  గణన తో పాటుగా కుల గణ‌ను కూడా చేయనున్నారు .. బీహార్ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ సంచల నిర్ణయం తీసుకుంది .

మరింత సమాచారం తెలుసుకోండి: