
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి కారణంగానే సింగయ్య అనే వ్యక్తి మృతి చెందారు అంటూ ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తుంది. అసలు విషయంలోకెళితే ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్ సత్తెనపల్లి నియోజకవర్గ రెంటపాళ్లలో పర్యటించిన విషయం అందరికీ తెలిసిందే. ఈ పర్యటనలో ఏటుకూరు బైపాస్ దగ్గర జగన్ కాన్వాయ్ లోని వాహనం ఢీకొని సింగయ్య అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందారు.తాజాగా ఈ కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది.
ముఖ్యంగా సింగయ్యను ఢీ కొట్టింది జగన్ ప్రయాణించిన వాహనమే అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఘటన జరిగిన ప్రదేశాన్ని సీసీ ఫుటేజ్ లతో పరిశీలించగా విస్తుపోయే నిజాలు బయటకు వచ్చాయి. ముఖ్యంగా సీసీ ఫుటేజ్ లతో పాటు ప్రత్యక్ష సాక్షులు కూడా ఆధారాలను సేకరించే పనిలో పడగా.. పోలీసులకు కీలక ఆధారాలు లభించాయి. జగన్ ప్రయాణిస్తున్న కారు చక్రాల కింద పడి ఒక వ్యక్తి నలిగిపోయినట్లు చూపించే వీడియో ఆధారాలను ఇప్పుడు పోలీసులు సేకరించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఆ వీడియోలో జగన్ తన కారు పైన నిలబడి పార్టీ కార్యకర్తలకు, అభిమానులకు అభివాదం చేస్తూ ఉండగా.. ఒక కార్యకర్త కారు టైర్ల కింద పడి నలిగిపోవడం అక్కడ స్పష్టంగా కనిపించింది. దీంతో సోషల్ మీడియా వేదికగా నెటిజన్స్ స్పందిస్తూ సింగయ్య మృతికి కారణం జగన్.. ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. కాన్వాయ్ ఢీకొని పార్టీ కార్యకర్త చనిపోతే కనీసం సంతాపం కూడా జగన్ తెలియజేయకపోవడం పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరి జగన్ వల్లే సింగయ్య చనిపోయినట్లు ఇప్పుడు ఆధారాలు బయటపడ్డాయి. ఇందుకు సంబంధించిన వీడియో కూడా సంచలనం సృష్టిస్తుంది. ఇక ఈ కారణంగా జగన్ జైలుకే అంటూ కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.