
ప్రోటోకాల్స్ లలో కలెక్టర్ కంటే ఎమ్మెల్యేనే ఎక్కువ అన్న వ్యాఖ్యలు.. కార్పొరేటర్లతో సమానంగా ఎమ్మెల్యేలను కూర్చోబెట్టడం అది ఎమ్మెల్యేలకే అవమానంగా భావిస్తున్నామంటూ తెలియజేశారు. ఇలాంటి సమావేశం జరిగేటప్పుడు ఖచ్చితంగా ప్రోటోకాల్ పాటించాల్సిన అవసరం ఉందని సూచించారు. అయితే ఈ అంశానికి సంబంధించి ఎమ్మెల్యేలు కూడా తనతో మాట్లాడారని అందుకే తాను మాట్లాడాను అంటూ rrr తెలియజేశారు. అంతేకాకుండా తనకన్నా కింద ప్రోటోకాల్ ఉన్న వారిని ముందు కూర్చోబెడితే తాను కూడా అవమానంగానే ఫీల్ అవుతానని తెలిపారు.
అయితే ప్రతి చిన్న విషయాన్ని కూడా పెద్దదిగా చేసి చూపించడం వల్ల ఇది రాజకీయంగా కూటమిని ఇరుకుని పెట్టేలా చేస్తోంది. rrr కు ప్రతిపక్ష పార్టీ వైసీపీకి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉన్నది. అయితే ఇప్పుడు తాజాగా రఘురామ చేసిన కామెంట్స్ వైసీపీ పార్టీకి అనుకూలంగా మారేలా కనిపిస్తోందని సీఎం చంద్రబాబు కూడా ఎమ్మెల్యే తీరు పైన ఆగ్రహాన్ని తెప్పించేలా చేశారని విధంగా వార్తలు వినిపిస్తున్నాయి. ఎలాంటి విషయాలైనా సరే పార్టీ లోపలి చెప్పుకోవాలి.. ఇలా బహిరంగంగా వ్యాఖ్యలు చేయడం ప్రెస్మీట్లో పెట్టడం వంటివి సరికాదు అంటూ సీఎం చంద్రబాబు పరోక్షంగా హెచ్చరించినట్లు సమాచారం..RRR గతంలో కూడా వైసిపి పార్టీలో ఉన్నప్పుడు వైసిపి పార్టీ పై కూడా పలు రకాల వ్యాఖ్యలు చేశారు.