తెలంగాణ బీజేపీ  అధ్యక్ష పదవి పై ఎన్నో ఆశలు పెట్టుకున్న ఈటల రాజేందర్ కు భారీ షాక్ తగిలింది .. బీజేపీ అధ్యక్ష పదవిపై ఆయన ఎన్నో ఊహల్లో ఉన్నారు కానీ ఆ పదవి ఆయన దగ్గరనుంచి చేయి జారిపోయింది .  పెద్దగా ఈ రేస్ లో వినిపించని పేరు రామచందర్రావుకు ఈ అవకాశం వచ్చింది .. అయితే  ఇప్పుడు ఈటల రాజేందర్ పరిస్థితి ఎటు కాకుండా పోయినట్లుగా మారింది .. ఆయన గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా సీఎం అభ్యర్థిగా ప్రధాని మోదీ ప్రోక్షంగా ప్రచారం చేశారు .. అలాగే బీసీ సీఎం నిదాదంతో ఆయన్ని ముందు పెట్టారు. కానీ అంత‌గా ఫలితాలు అందలేదు ..


మల్కాజిగిరి  నుంచి ఎంపీగా గెలిచిన తర్వాత కేంద్ర మంత్రివర్గంలో అవకాశం వస్తుందని భావించారు .. కానీ అది బండి సంజయ్ , కిషన్ రెడ్డిలకు ఛాన్స్ రావడంతో ఈట‌లకు బిజెపి అధ్యక్ష పదవి ఇస్తారని ఎంత అనుకున్నారు .. కానీ ఇప్పుడు రాను రాను ఆయనకు బిజెపిలో వ్యతిరేకంగా ఓ వర్గం హైకమాండ్ వద్ద భారీ ప్రచారం చేయటం మొదలుపెట్టిందని .. చివరికి నిన్నగాక మొన్న పార్టీలోకి వచ్చిన వారికి ఇలా ఇవ్వటం కన్నా .. ఎప్పటినుంచో పార్టీలో ఉన్న వారికి ఇవ్వటం మంచిదని ..  హైకమాండ్ సంచలన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది ..



అలాగే ఈటల రాజేందర్ .. ముందుగా బిజెపిలో చేరెకన్నా కాంగ్రెస్ లో చేరినట్లయితే ఆయన ఇప్పటికే క్యాబినెట్లో ఉండేవారు .. అలాగే సీఎం  రేవంత్ తో ఆయనకు మంచి  స్నేహ బంధం కూడా అప్పట్లో ఉండేవి.   ఇక ఇప్పుడు ఆయన బిజెపిలోనే మరో నాలుగేళ్లు ఎంపీగా ఉండాల్సి ఉంటుంది .. ప్రస్తుతం బీఆర్ఎస్ కు మద్దతుగా మాట్లాడుతున్నారన్న ఊహ గణాలు కూడా వినిపిస్తున్నాయి .. ప్రస్తుతం తెలంగాణలో బీఆర్ఎస్ పరిస్థితి మళ్ళీ చక్కబడితే అధికారంలోకి వస్తుందంటే ఈటల రాజేందర్పార్టీ వైపు చూసే అవకాశాలు ఉన్నాయన్న అభిప్రాయాలు కూడా గట్టిగా వినిపిస్తున్నాయి .

మరింత సమాచారం తెలుసుకోండి:

BJP