రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చామంటే తండ్రి కొడుకులు, తల్లి కూతుర్లు, అత్తమామలు, అన్నా చెల్లెళ్ళు ఇలా రిలేషన్స్ మారుస్తారట. రాజకీయమే పరమావధిగా అలవర్చుకొని సొంత వాళ్ళనే దూరం పెడుతూ ఒక్కోసారి వాళ్లను పూర్తిగా లోకంలోనే లేకుండా చేసే ప్రయత్నాలు కూడా రాజకీయాల్లో జరుగుతూ ఉంటాయి. రాజకీయాల్లో పూర్తిగా మునిగిపోయిన నాయకుడికి బంధుప్రీతి అనేది అస్సలు కనిపించదు. తనకు అడ్డొచ్చిన సొంత వాళ్లనైనా వదిలేయడానికి వెనుకాడరు.. అలా రాజకీయ ఓనమాలు నేర్చుకొని రాజకీయాల్లో రాష్ట్రాలను పాలించిన ఫ్యామిలీలో వైయస్ ఫ్యామిలీ ఒకటి కేసీఆర్ ఫ్యామిలీ మరొకటి.. ఇప్పటికే వైయస్ రాజకీయ వారసులుగా జగన్, షర్మిల రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి మంచి స్థానంలోకి వెళ్లిపోయారు. 

ఇక జగన్ అయితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఓసారి ఏపీ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కూడా అయ్యారు. మొదట్లో షర్మిల జగన్ కు ఎంతో సపోర్ట్ చేస్తూ వచ్చింది. కానీ ఆ తర్వాత ఏమైందో ఏమో వారి మధ్య కాస్త గొడవలు వచ్చి జగన్ కి వ్యతిరేకంగా గళం వినిపించింది. అంతేకాదు జగన్ కు ఆగర్భ శత్రువు అయినటువంటి ఏబీఎన్  ఛానల్ కు షర్మిల దగ్గరయిపోయి జగన్ పై ఇంటర్వ్యూలు కూడా ఇచ్చింది. ఈ విధంగా తన అన్నను ఈ ఎన్నికల్లో ఓడిపోయేలా ప్రముఖ పాత్ర పోషించిందని చెప్పవచ్చు.. ఇప్పుడు అదే బాటలో కవిత కూడా నడుస్తుందని చెప్పాలి. గత రెండు పర్యాయాలు  తెలంగాణ రాజకీయాల్లో చక్రం తిప్పిన కవిత తండ్రికి,అన్నకు సపోర్ట్ చేస్తూ వచ్చింది.

కానీ వీరిమధ్య ఏమైందో ఏమో  తాజాగా కవిత జన జాగృతి అనే పార్టీ ద్వారా తన సొంత పంతాను నెగ్గించుకోవాలనుకుంటుంది. అన్నకు వ్యతిరేకంగా మాట్లాడుతూ బీఆర్ఎస్ వ్యతిరేక మీడియా అయినటువంటి టీవీ5 కి చాలా దగ్గరయిపోయింది. ఈ విధంగా కవితకు సంబంధించిన ప్రతి వార్త టీవీ 5 లో అద్భుతంగా టెలికాస్ట్ అవ్వడం, ఆ ఛానల్ కు  కవిత దగ్గర అవ్వడం చూస్తే మాత్రం తప్పకుండా కేటీఆర్ ను దెబ్బ కొట్టాలనే చూస్తోంది. ఆంధ్రప్రదేశ్లో జగన్ ను దెబ్బ కొట్టడానికి నాడు కాంగ్రెస్ కి ఎంతో సపోర్ట్ అందించింది షర్మిల.. అయితే ఇప్పుడు తెలంగాణలో కేటీఆర్ ను దెబ్బ కొట్టడానికి కవితకు ఏ పార్టీ మద్దతిస్తుందో ముందు ముందు తెలుస్తుంది..

మరింత సమాచారం తెలుసుకోండి: