
అవిక్రమంగా షాపుల మొత్తాన్ని విస్తరించడంతో చుట్టుపక్కల ఉండే షాపులకు కూడా ఈ మంటలు ఎగిసిపడ్డాయి. ఈ క్రమంలోనే ఆలయం ముందు ఉన్న చదవ పందిళ్లకు మంటలు పాకాయి. దీంతో రెండు మూడు షాపులు కూడా తిరుపతిలో దగ్గుమైనట్లుగా సమాచారం. అక్కడ భారీగా అగ్ని మెరుపులు ఎగిసిపడడంతో అక్కడ ఉండే స్థానికులు , భక్తులు భయాందోళనకు గురవుతున్నారు. ఈరోజు తెల్లవారుజామున ఈ ప్రమాదం జరగడంతో హుటాహుటిక అగ్నిమాపక సిబ్బంది కూడా ఆ ప్రాంతానికి చేరుకొని మంటలను ఆర్పి వేసినట్లుగా తెలుస్తోంది. దీంతో కొంతమేరకు అక్కడ భక్తులు ఊపిరి పీల్చుకున్నారు.
కానీ అప్పటికే ఆ మంటలలో చిక్కుకున్న సామాగ్రి పూర్తిగా కాలిపోయిందని భక్తులు పెద్దగా లేకపోవడంతో అక్కడ ప్రాణ నష్టం తప్పిందనే విధంగా తెలుస్తోంది. అయితే ఆ షాపులలో విద్యుత్ ఘాతకం కారణంగా ఈ అగ్ని ప్రమాదం సంభవించినట్లు అధికారులు తెలియజేస్తున్నారు. అందుకు సంబంధించి కొన్ని వీడియోలు, ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఇప్పటికే చాలా సందర్భాలలో టీటీడీ సంస్థ కూడా ఎలాంటి సంఘటనలు జరగకుండా పలు రకాల చర్యలు తీసుకుంటూ ఉన్నప్పటికీ ఎందుకో కానీ ఇలాంటి చర్యలు రోజురోజుకీ ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. మరి ఈ విషయం పైన టీటీడీ బోర్డు మెంబర్స్ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.