కూన ర‌వికుమార్‌. సీనియ‌ర్ టీడీపీ యువ నాయ‌కుడు. మంచి వాక్చాతుర్యం.. ఇట్టే ఆక‌ర్షించే నైపుణ్యం ఉన్న నాయ‌కుడుగా పేరు తెచ్చుకున్నారు. ఆమ‌దాల వ‌ల‌స నుంచి గ‌త ఎన్నిక‌ల్లో విజ‌యం ద‌క్కించు కున్నారు.  అయితే..ఈయ‌న ఇక్క‌డ గెల‌వ‌డం తొలిసారి కాదు. దీంతో కొత్త‌గా.. ఈయ‌న‌పై ఎక్స్‌పెక్టేష‌న్లు అంటూ ఏమీ లేవు. అయితే.. పాత స‌మ‌స్య‌లు, అప‌రిష్కృతంగా ఉన్న భారీ ప్రాజెక్టులు మాత్రం ఎమ్మెల్యే కు స‌వాలుగా మారాయి.


కొన్నాళ్ల కింద‌టే.. భారీ ప్రాజెక్టును తీసుకువ‌చ్చారు. దీంతో పాటు వంశ‌ధార జ‌లాల వ్య‌వ‌హారం కూడా.. ఎమ్మెల్యే ప‌రిష్క‌రించే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. వంశ‌ధార స‌మ‌స్య ఇప్ప‌టిది కాదు.. చాలా రోజుల నుంచి ఉంది. ఎన్నిక‌ల్లో ఇది త‌ర‌చుగా ఒక ప్ర‌ధాన డిమాండ్‌గా కూడా మారుతుంది. నాగావ‌ళి-వంశ‌ధార‌ల ద్వారా స్థానిక రైతాంగానికి సాగునీరు అందిస్తే.. ఉత్త‌రాంధ్ర‌లో దుర్భిక్షం త‌గ్గుతుంద‌న్న‌ది నిపుణుల చర్చ‌. అందుకే ఎప్పుడు ఎన్నిక‌లు వ‌చ్చినా.. ఈ విష‌యం చ‌ర్చ‌కు వ‌స్తుంది.


ఇక‌, జీడి మామిడి, కాజు పంట‌ల మాట ఎలా ఉన్నా.. వీటి ప‌రిశ్ర‌మ‌ల కార‌ణంగా త‌లెత్తుతున్న ప‌ర్యావ‌ర‌ణ స‌మ‌స్య కూడా ఎమ్మెల్యేల‌కు ఇబ్బందిగానే మారింది. వీటిని కూడా ప‌రిష్క‌రించేందుకు కూన ప్ర‌య‌త్ని స్తున్నారు. ఇదిలావుంటే.. రాజ‌కీయంగా కూన‌కు ఇప్పుడు నియోజ‌క‌వ‌ర్గంలో తిరుగులేద‌న్న టాక్ వినిపి స్తోంది. వైసీపీ త‌ర‌ఫున పెద్ద‌గా బ‌ల‌మైన నాయ‌కులు లేక‌పోవ‌డం.. ఉన్న సీతారాం కూడా మౌనంగా ఉండ డం వంటివి కూన‌కు క‌లిసి వ‌స్తున్నాయి.


టీడీపీ-జ‌న‌సేన నాయ‌కులు ఇక్క‌డ క‌లివిడిగా ఉండ‌డం కూడా.. ర‌వి రాజ‌కీయాల‌కు మ‌చ్చుతున‌క‌.. నిరం త‌రం ప్ర‌జ‌ల‌కు చేరువ‌గా ఉండే కార్య‌క్ర‌మాల‌కు శ్రీకారంచుడుతున్నారు. ఆన్‌లైన్ ద్వారా కూడా అందుబా టులో ఉంటున్నారు. అదేస‌మ‌యంలో పార్టీ కార్య‌క్ర‌మాల‌ను సాగిస్తూ.. క్షేత్ర‌స్థాయిలో స‌మ‌స్య‌ల‌ను కూడా ప‌రిష్క‌రించే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఎక్క‌డా గ్రూపులు క‌ట్ట‌కుండా.. రాజ‌కీయాలు సాగేలా వ్య‌వ‌హ‌రిస్తు న్నారు. ఇలా.. కూన ర‌వికుమార్‌.. క‌లిసి వ‌చ్చిన కాలాన్ని స‌ద్వినియోగం చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: