
కేంద్రీయ, నవోదయ విద్యార్థులకు సైతం తల్లికి వందనం స్కీమ్ నగదు జమ కావడం గమనార్హం. మొదటి విడతలో నగదు జమ కానీ వాళ్లకు ప్రయోజనం చేకూరే విధంగా ఏపీ సర్కార్ వ్యవహరించడం గమనార్హం కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న సంస్థల విద్యార్థులు తల్లుల ఖాతాలలో సైతం నగదు జమ కావడంపై ప్రశంసలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం
అయితే ఇంటర్ ఫస్టియర్ సి.బీ.ఎస్.ఈ చదువుతున్న ఏపీ విద్యార్థులకు మాత్రం తల్లికి వందనం నగదు జమ కాలేదు. ఈ విద్యార్థులకు సైతం ప్రభుత్వం వైపు నుంచి సహాయం అందితే బాగుంటుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తల్లికి వందనం విషయంలో వాళ్లకు మాత్రం అన్యాయం జరిగిందా అనే కామెంట్లు సోషల్ మీడియా వేదికగా వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.
తల్లికి వందనం స్కీమ్ ద్వారా గతంతో పోలిస్తే ఎక్కువమంది విద్యార్థులకు లబ్ది చేకూరడంపై ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. ఒక్కొక్కరికి 13,000 రూపాయల చొప్పున నగదు అర్హత ఉన్న ఖాతాలలో జమవుతూ ఉండటం సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతోంది.
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు