
ప్రస్తుతం ఎమ్మెల్యే కుటుంబం పేదరికంతో ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటోందని తెలుస్తోంది. అయితే రాజానగరం ఎమ్మెల్యే కామెంట్లపై ప్రజల్లో భిన్నాభిప్రాయాలు ఎదురవుతూ ఉండగా ఆయన ఆస్తులను బదిలీ చేశారంటూ కొంతమంది ప్రచారం చేస్తున్నారు. నెటిజన్లు మాత్రం ఈ నేతను టార్గెట్ చేస్తూ కామెంట్లు చేస్తున్నారు. అయితే ఎవరి కామెంట్లలో నిజం ఉందో కాలమే సమాధానం చెప్పాల్సి ఉంది.
ప్రస్తుతం అల్లుడు కొనుగోలు చేసిన కారులో ఆయన తిరుగుతున్నారు. ఎన్నికల కోసం 50 కోట్ల రూపాయలు ఖర్చు చేశానని ఆయన చెబుతున్నట్టు తెలుస్తోంది. ఎన్నికలకు ముందు ఈ నేత 30 ఎకరాలు అమ్మారని అయితే ఆ తర్వాత కోట్ల రూపాయలు ఖర్చు చేసి స్థలం కొనుగోలు చేశారని వినిపిస్తోంది. ఈ నేతపై కొంతమంది అవినీతి ఆరోపణలు చేస్తుండటం కొసమెరుపు.
బత్తుల తండ్రి ఎరువుల వ్యాపారి కాగా తర్వాత రోజుల్లో అంతకంతకు ఎదిగి ఈ స్థాయికి చేరుకున్నారు. అయితే ఎమ్మెల్యే బీద అరుపులలో ఎంతమేర నిజాలున్నాయో చూడాల్సి ఉంది. రాజానగరం ఎమ్మెల్యే కామెంట్లపై కొందరు జనసేన కార్యకర్తలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారని సమాచారం అందుతోంది.
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు