ప్రపంచాన్ని సైతం  గడగడలాడించిన  కరోనా మహమ్మారి వల్ల లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారు. సరైన సమయానికి వ్యాక్సిన్ రావడం వల్ల చాలామంది ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఇప్పటికి కూడా కరోనా భయాలు ప్రజలను వెంటాడుతూనే ఉన్నాయి. అప్పుడప్పుడు కొన్ని వైరస్లు కలకలాన్ని సృష్టిస్తూ ఉన్నాయి. కోవిడ్ విజ్రుంభన దాటికి  అగ్రరాజ్యం అయిన అమెరికా కూడా ఇప్పుడు వనికిపోతుంది. ఇప్పుడు అమెరికాలో వేసవి సెలవులు కావడం చేత ఎక్కువగా అక్కడివారు ప్రయాణాలు చేస్తూ ఉండడం చేత కరోనా కూడా వేగంగా వ్యాప్తి చెందుతోంది.


ఇప్పటికే అక్కడ భారీగా కేసులు నమోదు అయ్యాయని అమెరికా వైద్యశాఖ తెలియజేస్తోంది.అమెరికాలో 25 రాష్ట్రాలలో కేసులు నమోదైనట్లుగా పలు రకాలు నివేదికలు బయటపడ్డాయి. ఓహియో, కాలిఫోర్నియా, టెక్సాక్, ఫ్లోరిడా వంటి రాష్ట్రాలలో కూడా కరోనా సంఖ్య చాలా అధికంగా పెరిగిపోయిందని అధికారులు తెలియజేస్తున్నారు. NB.1.8.1 (XFG) అని వేరియంట్ ప్రస్తుతం అమెరికాలో వేగంగా వ్యాప్తి చెందుతున్నది. దీనివల్ల మానవ శరీరంలో గొంతు నొప్పి, శ్వాస తీసుకోవడం గుండె బరువుగా అనిపించడం వంటివి లక్షణాలు కనిపిస్తున్నాయట.


ఇక వైరస్ ని అరికట్టడానికి ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ అధికారులు కూడా హెచ్చరిస్తున్నారు. ఎవరికైనా అనుమానంగా లక్షణాలు కనిపిస్తే ఖచ్చితంగా వారు కరోనా టెస్ట్ చేయించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. దీని ద్వారా కరోనాని అరికట్టవచ్చని తెలియజేస్తున్నారు. ప్రతి ఒక్కరు మాస్కులు ధరించాలని రద్దీగా ఉండే ప్రదేశాలకు వెళ్లకపోవడమే మంచిదని ముఖ్యంగా వృద్ధులు, చిన్న పిల్లలు సైతం మాస్కులు ధరించడం మంచిదంటూ తెలుపుతున్నారు.  అమెరికాలో వ్యాపిస్తున్న ఈ కరోనా వైరస్ ఎక్కువగా మరుగు నీటిలో చాలా అధికంగా ఉంటుందని అధికారులు తెలియజేస్తున్నారు. అందుకే ప్రజలందరూ కూడా ఇంటి ముందు చాలా శుభ్రంగా ఉంచుకోవాలని అవసరమైతే బ్లీచింగ్ పౌడర్ చల్లుకోవాలని తెలియజేస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తోంది అగ్రరాజ్యం అమెరికా.

మరింత సమాచారం తెలుసుకోండి: