
ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై విపక్షాల నుంచి విషప్రచారం అధికమవుతోంది. సోషల్ మీడియా వేదికగా ఎన్నో అసత్య ఆరోపణలు, వక్రీకరించిన విషయాలు వైరల్ అవుతున్నాయి. ఇవి ప్రజల్లో భ్రాంతి కలిగించేలా ఉంటూ, రాజకీయ ప్రయోజనాల కోసమే జరుగుతున్నట్టు స్పష్టంగా తెలుస్తోంది. జగన్ పై కూటమి అనుకూల మీడియా విషం కక్కుతుండటం నెట్టింట హాట్ టాపిక్ అవుతోంది.
తాజాగా జగన్ ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ కూటమి సర్కార్ దుష్ట సాంప్రదాయాలకు తెర తీసిందని అన్నారు. జగన్ మాట్లాడిన స్పీచ్ ను జగన్ ను అభిమానించే వాళ్ళు విన్న విధంగా మిగతా వాళ్ళు వినకపోవచ్చు తెలుగుదేశం వాళ్ళు ఆ స్పీచ్ ను విని ఉండొచ్చు. అయితే కూటమి అనుకూల మీడియా ఆలోచనలు జగన్ కు వ్యతిరేకంగానే ఉంటాయని చెప్పవచ్చు. కూటమి అనుకూల పత్రికలు దీనిని అడ్వాంటేజ్ గా తీసుకున్నాయి.
మూడేళ్ళలో చంద్రబాబు ఎగిరిపోతాడు, రప్పా రప్పా తప్పేందప్పా అంటూ జగన్ మాట్లాడిన మాటలకు పొంతన లేకుండా కథనాలకు ప్రచురించడం కొసమెరుపు. ఈ తరహా కథనాల విషయంలో చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత జగన్ పై ఉంది. జగన్ మాట్లాడింది ఒకటైతే కథనాలు మాత్రం మరో విధంగా ఉండటంపై సోషల్ మీడియా వేదికగా సైతం భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.
చంద్రబాబు నాయుడు సైతం ఇలాంటివి ప్రోత్సహించకుండా నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉందని చెప్పడంలో సందేహం అవసరం లేదు. చంద్రబాబు నాయుడు జగన్ విషయంలో మరీ కక్షపూరితంగా వ్యవహరించడం కరెక్ట్ కాదని చెప్పవచ్చు. ఏపీ రాజకీయాలలో ఊహించని మలుపులు చోటు చేసుకుంటూ ఉండటం గమనార్హం.
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు