
ఇక, జగన్‌ను కూడా అరెస్టు చేస్తారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. తాజాగా మద్యం కుంభకోణంపై ప్రత్యే క దర్యాప్తు బృందం.. 300 పేజీలకు పైగా చార్జిషీట్‌ను సమర్పించింది. అయితే.. దీనిలో 12 చోట్ల జగన్ పేరును పేర్కొనడం గమనార్హం. బిగ్ బాస్ అంటూ.. జగన్ పేరును నేరుగా ప్రస్తావించకపోయినా.. పరోక్షం గా ఆయన పేరును ఉటంకించారు. ఇదిలావుంటే.. దీని ఆధారంగా జగన్‌ను అరెస్టు చేస్తే.. ఆ పార్టీకి సింపతీ వచ్చే అవకాశం ఉందా? అనేది రాజకీయాల్లో జరుగుతున్న చర్చ.
దీనిపై ఇతర పార్టీలకంటే కూడా.. టీడీపీలోనే ఎక్కువగా ఉండడం గమనార్హం. దీనికి కారణం.. గతంలో చంద్రబాబును అరెస్టు చేసినప్పుడు.. ఆయనకు, పార్టీకి కూడా సింపతీ వచ్చింది. అలానే ఇప్పుడు కూడా వైసీపీకి సింపతీ వస్తుందా? అనేది ఆసక్తిగా మారింది. కానీ, అలా రాదని.. వచ్చే అవకాశం కూడా లేదని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. గతంలో చంద్రబాబుకు మద్దతుగా పవన్ కల్యాణ్ నిలబడ్డారు. దీనికితోడు.. చంద్రబాబుకు మద్దతుగా ఐటీ ఉద్యోగులు, మేధావులు బయటకు వచ్చారు.
ఫలితంగా.. చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు.. ఆయనకు సింపతీ వచ్చింది. కానీ, ఇప్పుడు జగన్‌కు అలాం టి మద్దతు వచ్చే అవకాశం కనిపించడం లేదు. ఆయనకు సొంత వారంటూ.. ఇప్పుడు దూరమయ్యారు. తల్లి, చెల్లితోపాటు.. బలమైన నాయకుడిగా ముందుకు సాగుతున్న సాయిరెడ్డి కూడా పార్టీకి రాం రాం చెప్పారు. ఇక, పార్టీ పరంగా ముందుకు తీసుకువెళ్లేందుకు.. తోడుగా వచ్చేందుకు మరో ప్రధాన పార్టీ అంటూ ఏమీ లేకుండా పోయింది. పైగా.. మద్యం కేసులో 3 వేల కోట్ల రూపాయలకుపైగా గోల్ మాల్ జరిగిన క్రమంలో దీనినిఇతర పక్షాలు కూడా సీరియస్‌గా తీసుకునే అవకాశం ఉంది. సో.. ఎలా చూసుకున్నా.. జగన్‌కు సింపతీ దక్కే అవకాశం లేదని పరిశీలకులు చెబుతున్నారు.