
బ్యాలెన్స్ చెక్ చేసే వాటికి పరిమితి:
బ్యాలెన్స్ చాలామంది ఎన్నోసార్లు చెక్ చేస్తూ ఉంటారు. అయితే వీటికి కొత్తగా నిబంధనలను తీసుకువచ్చింది. ఒక్కరోజులో గరిష్టంగా 50 సార్లు మాత్రమే మీ బ్యాలెన్స్ ని చెక్ చేసుకోవాలి. ఎక్కువమంది తరచూ బ్యాలెన్స్ చెక్ చేయడం వల్ల సర్వర్ పైన ఒత్తిడి పెరిగి మరి లావాదేవీల వేగం తగ్గుతోందని NPCI భావిస్తోంది. అందుకే పరిమితి పెట్టారట.
2). ఇకపై మొబైల్ నెంబర్ కు లింక్ చేయబడిన ఖాతాల బ్యాంకులన్నిటి జాబితాను ఒక్కరోజులో 25 సార్లు మాత్రమే చూడగలరు. ఇలా చేయడం వల్ల యూపీఐ సేవను మరింత సున్నితంగా నడిపించడానికి చాలా ఉపయోగపడుతుందట.
3).మ్యూచువల్ ఫండ్, ఓటీటి , ఇతర ఆటో పే లావాదేవీలకు సంబంధించి సౌకర్యాలను ఉపయోగించుకోవాలనుకునేవారు మూడు టైమ్స్ స్లాట్లు నిర్ణయించారు. ఉదయం 10 గంటలకు ముందు..లేదా మధ్యాహ్నం ఒంటిగంట నుంచి సాయంత్రం ఐదు గంటల సమయంలో.. లేకపోతే రాత్రి 9:30 గంటల తర్వాత.
కొన్నిసార్లు మనం పేమెంట్స్ చేస్తున్నప్పుడు ఫెయిల్ అవుతూ ఉంటాయి. అయితే పదే పదే వాటి స్థితిని తనిఖీ చాలామంది చేస్తూ ఉంటారు. ఇలా విఫలమైన లావాదేవీలస్థితిని రోజులో కేవలం మూడుసార్లు మాత్రమే తనిఖీ చేసుకొనే అవకాశం కల్పిస్తోంది. ఈ మూడు సార్లలో కూడా కనీసం ఒక్కోసారి 90 సెకెండ్ల వ్యవధి ఉండడం అవసరమట.
NPCI కార్యకలాపాలన నియంత్రించే సంస్థ అన్ని బ్యాంకులకు చెల్లింపులకు కఠినమైన ఆదేశాలను జారీ చేసింది.