ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎలక్షన్స్ వచ్చాయి అంటే చాలు  నేతల మధ్య మాటల తూటాలు పేలుతాయి. ఎమ్మెల్యే ఎలక్షన్స్ ఒక విధంగా ఉంటే గ్రామీణ స్థాయిలో జరిగే ఎన్నికలు మరో రకంగా ఉంటాయి. రాష్ట్రమంతా ఒకెత్తయితే పులివెందులలో రాజకీయం మరో ఎత్తు. ఎందుకంటే  ఈ ప్రాంతమంతా వైయస్ రాజశేఖర్ రెడ్డి ఆధీనంలోనే ఉండేది. ఆ తర్వాత వైయస్ జగన్ మోహన్ రెడ్డి చేతిలోకి వచ్చింది. వైయస్ ఫ్యామిలీకి సంబంధించి ఈ ప్రాంతంలో ఎక్కువ పట్టు ఉంటుంది. అలాంటి ఈ సమయంలో ఇక్కడ ఒంటిమిట్ట జెడ్పిటిసిగా ఉన్న మహేశ్వర్ రెడ్డి గంగమ్మ జాతరలో ప్రమాదవశాత్తు మరణించడంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. 

దీంతో ఈ ప్రాంతంలో బీటెక్ రవి, సతీష్ రెడ్డి మధ్య  హోరా హోరీగా సవాళ్ల పర్వం నడుస్తోంది. ఒకరిపై ఒకరు విమర్శలు ఆరోపణలు చేసుకుంటున్నారు. నువ్వెంత అంటే నువ్వెంత అంటూ ఘాటు విమర్శలు చేసుకుంటున్నారు. చాలా సంవత్సరాల పాటు కలిసిమెలిసి రాజకీయం చేసిన ఈ ఇద్దరు నేతలు, ఇప్పుడు చెరో పక్షం చేరి విమర్శలతో కత్తులు దూసుకుంటున్నారు. ఇదే తరుణంలో మహేశ్వర్ రెడ్డి భార్య ఉమాదేవి, లేదంటే ఆయన కొడుకును  బరిలోకి దించాలని వైసీపీ చూస్తోంది. ఇదే తరుణంలో టిడిపి తరఫున ఎవరిని నిలబెడతారు అనేది సస్పెన్స్ గా మారింది. అలాగే ఈ ప్రాంతానికి చెందిన  కాంగ్రెస్ నాయకురాలు షర్మిలా ఉంది

కాబట్టి కాంగ్రెస్ నుంచి కూడా బలమైన అభ్యర్థి ఉండబోతున్నట్టు తెలుస్తోంది. ఇదే గనక జరిగితే పులివెందులలో జరగబోయే జెడ్పిటిసి ఎన్నికల్లో త్రిముఖ పోరు తప్పదని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. మరి ఈ నియోజకవర్గంలో  బలంగా జగన్ ఉన్నాడు మరి అలాంటి ఈ స్థానంలో మళ్లీ వైసీపీ జెండా ఎగరవేస్తుందా లేదంటే వైసీపీని తలదన్ని టిడిపి కూటమి ఎగరేసుకు పోతుందా? ఈ రెండు పార్టీలని కాదని కొత్తగా వచ్చిన కాంగ్రెస్ అభ్యర్థి తన్నుకు పోతాడా అనే చర్చ నడుస్తోంది. వైసిపి నుంచి శ్రీకర్ రెడ్డితో పాటు, మేకపాటి నందకిషోర్ రెడ్డి ఆసక్తి చూపిస్తున్నారు.మరి చూడాలి ఈ ఎన్నికల్లో ఎవరు విజయం సాధిస్తారు ఎవరు సైలెంట్ గా ఉండిపోతారు అనేది ముందు ముందు తెలుస్తుంది..

మరింత సమాచారం తెలుసుకోండి: