
ఈ ఫోటోలలో నర్సరీ వార్షిక ఫీజు రూ.2,51,000 లక్షలు గా పేర్కొనడంతో పెద్ద ఎత్తున ఈ విషయం చర్చనీయంశంగా మారుతున్నది. ఈ విషయాన్ని ధరమ్ పార్టీ ఇండియా వ్యవస్థాపకరాలు అయిన అనురాధ తివారి తన ట్విట్టర్ నుంచి ఇందుకు సంబంధించి విషయాన్ని షేర్ చేసింది. మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించి విద్య పారదర్శకత పైన కూడా పలు రకాల ప్రశ్నలు లేవనెత్తేలా చేసింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో పిల్లలు ఏబిసిడిలు నేర్చుకోవడానికి 20,000 ఖర్చు చేస్తూ ఉంటే.. ఇంత మొత్తంలో భారీ ఫీజు సమర్పించుకోవడానికి అసలు పాఠశాలలో వారు ఏం బోధిస్తారు అంటూ ఆమె ప్రశ్నించింది.
పాఠశాలలో ఫీజుల పట్టిక ప్రకారం.. ప్రీ ప్రైమరీ మొదటి, రెండవ వార్షిక ఫీజు రూ.2,42,700 కాగా..1,2 తరగతులకు వార్షిక ఫీజు రూ.2,91,460 రూపాయలు అన్నట్లుగా ఉన్నది... ఈ ఫీజుల పట్టిక చూసిన తర్వాత పలువురు నెటిజన్స్ కూడా తీవ్రస్థాయిలో ఆగ్రహాన్ని తెలియజేస్తున్నారు.. చిన్నపిల్లలకు చెప్పే విద్యను కూడా ఇంత పెద్ద మొత్తంలో వసూలు చేయడం ఏంటి అంటూ ప్రశ్నిస్తున్నారు. మరి కొంతమంది ఇలాంటి స్కూళ్లలో చేర్పించకపోవడం మంచిది అంటూ సలహా ఇస్తున్నారు.. ఇప్పుడు విద్యా విధానంలో చాలా సంస్కరణలు తీసుకురావాలని మరి కొంతమంది కోరుతున్నారు.. భారతదేశంలో కూడా ప్రైవేట్ కోచింగ్ లు పుట్టగొడుగులులా పుట్టుకొస్తున్నాయని.. దీనివల్ల తమకు నచ్చిన విధంగా ఫీజులు పెంచేస్తున్నారని ఎంతోమంది విద్యార్థులు, నిరుద్యోగులు తెలియజేస్తున్నారు.