కొంతమంది నేతలు అసెంబ్లీ సమావేశాలలో చేస్తున్న కొన్ని పనుల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. అలా ఇప్పుడు తాజాగా మహారాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి మాణిక్ రావు కోకాటే అసెంబ్లీ జరుగుతున్న సమావేశంలో తన మొబైల్ లో రమ్మీ ఆడారని ప్రతిపక్ష  ఎమ్మెల్యే రోహిత్ పవార్ ఆరోపణలు చేశారు. అందుకు సంబంధించిన ఒక వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నది. అసెంబ్లీ జరుగుతున్న సభలో మాణిక్ రావు తన మొబైల్ లో రమ్మీ ఆడుతున్న వీడియోలను సోషల్ మీడియా వేదికగా పోస్ట్ షేర్ చేశారు.


అయితే ఈ వీడియో పోస్ట్ చేస్తూ రైతుల సమస్యల పైన మహాయుతి ప్రభుత్వానికి ఎంత చిత్తశుద్ధి ఉందో ఇందుకు నిదర్శనం ఇదే అంటూ ఎద్దేవ చేసినట్లుగా ట్వీట్ చేశారు. వ్యవసాయ రంగంలో ఎన్నో సమస్యలు పెండింగ్లో ఉన్నాయని రాష్ట్రంలో రోజుకి 8 మంది రైతులు మరణిస్తూ ఉన్నారని వాటన్నిటిని గాలికి వదిలేసి మరి ఇలా ఆడుకుంటున్నారంటూ ఎద్దేవ చేశారు రోహిత్ పహర్ వ్యాఖ్యానించారు.. అయితే ఈ వీడియో పైన క్లారిటీ ఇస్తూ మంత్రి మాట్లాడారు..


తనకు రమ్మీ ఆడడం తెలియదని ఆ గేమ్ ఆడాలంటే కూడా బ్యాంకు ఖాతా లింక్ అయ్యి ఉండాలి తన నెంబర్ లింక్ అయిందో లేదో చెక్ చేసుకోవచ్చు అంటూ ప్రతిపక్షాలకు సవాలు విసిరారు. ఎగువ సభ వాయిదా పడ్డాక తన మొబైల్ తీసుకున్నాను అందులో యూట్యూబ్ ఓపెన్ చేశాను ఆ సమయంలో గేమ్ డౌన్లోడ్ అయ్యి ఓపెన్ అయ్యిందని వాటిని క్లోజ్ చేసేందుకే ప్రయత్నిస్తున్న సమయంలో  ఇది జరిగిందంటూ తెలిపారు. ఇదంతా కూడా కేవలం 5 నుంచి 10 సెకండ్ల లోపే జరిగిందని.. ప్రస్తుతం ప్రచారంలో ఉన్న వీడియో ఐదారు సెకండ్ల ఫుటేజ్ మాత్రమే ఆ తర్వాత జరిగిన సంఘటనలు ఎందుకు చూపించలేదు అంటూ వ్యవసాయ శాఖ మంత్రి ప్రశ్నించారు. అయితే ఈ సంఘటన పైన ప్రతిపక్షాలు ఫైర్ అవుతూ ఈయన పైన చర్యలు తీసుకోవాలి అంటూ విజ్ఞప్తి చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: