ఏపీ రాజకీయాల్లో మ‌రోసారి వేడిపెరిగిపోయాయింది. తాజాగా ఈ క్రమంలో మాజీ మంత్రి కొడాలి నాని మరోసారి వార్తల్లోకి వచ్చారు. కారణం – ఆయనపై మరో పోలీస్ కేసు నమోదు కావడమే! విశాఖపట్నం ట్రీటౌన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో పాటు ఆయన కుటుంబ సభ్యులపై నాని చేసిన అనుచిత వ్యాఖ్యలపై ఓ మహిళ ఫిర్యాదు చేసింది . అంజనా ప్రియ అనే మహిళ , కొడాలి నాని పెట్టిన పోస్టులు చంద్రబాబును మరియు వారి కుటుంబాన్ని కించపరిచేలా ఉన్నాయని పేర్కొంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు చర్యలు ప్రారంభించారు .


పోలీసుల స్పందన – నోటీసుల జారీ .. పోలీసులు కేసు నమోదు చేసిన వెంటనే , గుడివాడలోని కొడాలి నాని నివాసానికి వెళ్లి 41 సీఆర్పీసీ సెక్షన్ కింద నోటీసులు జారీ చేశారు . విచారణకు హాజరుకావాలని సూచించారు . అయితే అప్పటికే నాని గుడివాడలో లేని కారణంగా, ఇంటిలో ఉన్న ఆయన వ్యక్తులకు నోటీసులు అందజేసినట్లు సమాచారం. కొడాలి నాని వ్యాఖ్యలపై మళ్లీ చర్చ .. కొడాలి నాని అంటే మాటల పిడుగు. తన దూకుడుతో మాటల్లో తేడా రాబట్టేలా మాట్లాడే స్టైల్ ఆయనకు ప్రత్యేక గుర్తింపు తెచ్చింది. కానీ గత కొన్నేళ్లుగా ఆయన చేస్తున్న వ్యక్తిగత విమర్శలు, సంచలన వ్యాఖ్యలు అనేకసార్లు వివాదాస్పదమయ్యాయి. తాజాగా ఈ కేసుతో మరోసారి నాని స్టైల్ రాజకీయాలకు చట్టబద్ధమైన అడ్డుకట్ట పడుతున్నదా? అన్న ప్రశ్న తలెత్తుతోంది.



వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి ..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు ..

మరింత సమాచారం తెలుసుకోండి: