దేశవ్యాప్తంగా ఉండే బ్యాంకింగ్ వ్యవస్థలలో అప్పుడప్పుడు కొన్ని విచిత్రమైన సంఘటనలు జరగడం వల్ల అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తాయి. అయితే తాజాగా ఉత్తరప్రదేశ్ లోని గ్రేటర్ నోయిడాలో జరిగిన ఒక ఇన్సిడెంట్ ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయంశంగా మారినట్లు తెలుస్తోంది. గడచిన రెండు నెలల క్రితం మరణించిన ఒక మహిళ బ్యాంకు ఖాతాలో ఏకంగా రూ.1.13 లక్షల కోట్ల రూపాయల డబ్బు జమ అయినట్లుగా తెలుస్తోంది. అది కూడా ఒక సాధారణ మహిళ ఖాతాలో ఇంత పెద్ద మొత్తంలో డబ్బు ఎలా జమ అయ్యిందని విషయం మిస్టరీగా ఉన్నది.


గ్రేటర్ నోయిడాకు చెందిన గాయత్రి అనే మహిళ.. కొన్ని కారణాల చేత గడిచిన రెండు నెలల క్రితం మరణించింది. అయితే ఆమెకు కుమారుడు 19 ఏళ్ల దీపక్ ఉన్నారు.. తన తల్లి బ్యాంకు ఖాతాను ఆ యువకుడే ఉపయోగిస్తున్నారు. అయితే ఆదివారం రాత్రి తన తల్లి బ్యాంకు ఖాతాకు సంబంధించి మొబైల్ కి ఒక మెసేజ్ వచ్చింది. ఇందులో..10,0135,60,00,00,00,01,00,23,56,00,00,00,00,299 రూపాయలు డబ్బులు జమ అయినట్లుగా చూపించారు.


మొదటిసారి ఈ మెసేజ్ లో ఉన్న సున్నాలని చూసి గాయత్రి కుమారుడు దీపక్ ఆశ్చర్యపోయారు. అయితే ఇది పొరపాటున జరిగిందనుకొని తన స్నేహితులకు కూడా ఈ సందేశాన్ని పంపించగా వారు నిజంగానే మీ అమ్మ బ్యాంకు అకౌంట్లో లక్షల కోట్ల రూపాయలు క్రెడిట్ అయ్యిందని చెప్పగా.. తన తల్లి ఖాతా చూసుకొని దీపక్ ఆశ్చర్యపోయారు. దీంతో సోమవారం రోజున ఉదయం దీపక్ తన తల్లి బ్యాంకు ఖాతా ఉన్న కోటక్ మహేంద్ర బ్యాంకుకు వెళ్లారు. అయితే ఈ సంఘటన గురించి బ్యాంకు అధికారులకు తెలియజేయగా వారు కూడా ఆశ్చర్యపోయారు. ఇంత పెద్ద మొత్తంలో లావాదేవీలు జరిగిన వెంటనే ఈ ఖాతాను ఫ్రీజ్ చేసి ఆదాయపన్ను విభాగానికి తెలియజేశారట.. మరి ఇది బ్యాంకింగ్ లోపం వల్ల జరిగిందా సాంకేతిక సమస్య వల్ల జరిగిందా లేకపోతే ఏదైనా అక్రమ డబ్బుల అన్న విషయం ఇంకా స్పష్టతగా రాలేదట. ముఖ్యంగా మరణించిన గాయత్రి ఖాతాలో ఈ డబ్బులు పడడంతో మరింత సందేహాలకు తెర లేపుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: