
ఖచ్చితంగా దేవుడు ఆశీర్వాదం ఉంటే మళ్లీ తిరిగి రాజకీయాలలోకి వస్తానని టిడిపి పార్టీ నుంచి మళ్లీ తన ప్రయాణం మొదలవుతుందనే విధంగా క్లారిటీ ఇచ్చారు. అవసరమైతే రాజ్యసభకు వెళ్తానని పార్టీ నాయకులతో కూడా సంప్రదింపులు జరుపుతున్నట్లుగా తెలియజేశారు. టిడిపి పార్టీ ఆశయాలకు తాను వ్యక్తిగత బాధ్యతలకు అనుగుణంగానే ఉంటానని తెలిపారు. తనకు టిడిపి పార్టీతో చాలా ప్రత్యేకించి అనుబంధం ఉందని పార్టీ కోసం గతంలో కూడా పనిచేసిన విధానాన్ని ఇప్పటికే ప్రజలు మర్చిపోలేరు అంటూ తెలియజేశారు గల్లా జయదేవ్.
గతంలో పార్లమెంట్ వేదికగా గల్లా జయదేవ్ ప్రత్యేక హోదా, విభజన హామీల పైన కూడా పోరాటం చేశారు. అలాగే 2019 ఎన్నికలలో వైసిపి భారీ విజయం సాధించినప్పటికీ కూడా టిడిపి నుంచి గల్లా జయదేవ్ విజయాన్ని అందుకున్నారు. 2024 ఎన్నికల ముందు రాజకీయాలకు గుడ్ బై చెప్పడంతో.. ఆ సీటును టిడిపి అభ్యర్థిగా పెమ్మసాని చంద్రశేఖర్ ఎంపీగా గెలిచి కేంద్ర మంత్రిగా కొనసాగుతున్నారు. మొన్నటి ఎన్నికలలో పోటీ చేయకపోయినా, రాజకీయాలకు గుడ్ బై అంటూ ప్రకటన ఇవ్వకపోయినా బాగుండేదని కార్యకర్తలలో చర్చ మొదలయ్యింది. 2026 లో ఆంధ్రప్రదేశ్ రాజ్యసభ సీట్లు కూడా ఖాళీ కాబోతున్నాయి. ఇప్పటికే చాలామంది నేతల పేర్లు వినిపిస్తున్నాయి.. మరి ఇలాంటి సమయంలో త్వరలో ఖాళీ కాబోయే రాజ్యసభ సీటును దృష్టిలో పెట్టుకొని పెద్దల సభకు గల్లా జయదేవ్ ను పంపిస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. మరి గల్లా జయదేవ్ రియంట్రీ తో టీడీపీలో ఎలా ఉండబోతుందో చూడాలి.