అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలపై ఈ మధ్య కాలంలో తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేస్తోందనే కారణం చూపుతూ మన దేశంపై ట్రంప్ ఊహించని స్థాయిలో సుంకాల భారాన్ని మోపారు. అయితే మోడీ తీసుకున్న నిర్ణయంపై భారత్ స్పందిస్తూ తమకు రైతుల ప్రయోజనాలే ముఖ్యమని వెల్లడించింది.

అయితే ట్రంప్ తాజాగా మాట్లాడుతూ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ట్రంప్ విధించిన సుంకాల భారం తగ్గేలా అడుగులు వేయాలని భారత్ భావిస్తోంది. అయితే ట్రంప్ మాత్రం ఇందుకు సిద్ధంగా లేరని తెలుస్తోంది. టారిఫ్ వివాదం పరిష్కారం అయ్యే వరకు  న్యూఢిల్లీతో ఎలాంటి వాణిజ్య  చర్చలు ఉండవని ఓవల్ కార్యాలయంలో ఒక ప్రశ్నకు ట్రంప్ బదులివ్వడం  గమనార్హం.

అయితే అమెరికా విదేశాంగ శాఖ మాత్రం ట్రంప్ వ్యాఖ్యలకు విరుద్ధంగా ఒక ప్రకటన చేసింది. విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి టామీ పికెట్ మాట్లాడుతూ భారత్ అమెరికాకు వ్యూహాత్మక భాగస్వామి అని చెప్పారు. టారీఫ్స్ నేపథ్యంలో ఇరు రాష్ట్రాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నా  ఆ దేశంలో పూర్తిస్దాయి చర్చల్లో పాల్గొంటామని ట్రంప్ చెప్పుకొచ్చారు.

రష్యా నుంచి చమురు కొనుగోలు విషయంలో ట్రంప్ స్పష్టంగా ఉన్నారని  దానికి ప్రతిస్పందగానే ట్రంప్ నేరుగా చర్యలు తీసుకున్నారని చెప్పుకొచ్చారు.  రష్యా నుంచి చమురు కొనుగోలు చేయొద్దని చెప్పిన తన హెచ్చరికలను పట్టించుకోకపోవడంతో  ట్రంప్ ఈ దిశగా నిర్ణయాలు తీసుకున్నారు.  అమెరికా మోపుతున్న భారాన్ని తామే మోస్తామని ప్రధాని ప్రకటన చేయడం  గమనార్హం.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: