జనసేన పార్టీ ఎమ్మెల్సీ నాగబాబుకు ఇప్పట్లో మంత్రి పదవి వచ్చేలా కనిపించడం లేదు.. ముందుగా ఆయన్ని రాజ్యసభకు పంపాలనుకున్నప్పటికీ పరిస్థితులు అనుకూలించకపోవడంతో ఎమ్మెల్సీ పదవి ఇచ్చి మంత్రివర్గంలోకి తీసుకోవాలని కూటమి ప్రభుత్వం భావించింది. అందుకు సంబంధించి సీఎం చంద్రబాబు కూడా ఒక ప్రెస్ నోట్ ను కూడా విడుదల చేశారు. అయితే ఏం జరిగిందో తెలియదు కానీ ఇప్పటిదాకా నాగబాబుకు మంత్రి పదవి అందుకోలేకపోయారు. మరి ఇకపైన అందుకుంటారా లేదా? అనే విషయంపై ఇప్పుడు అనుమానంగానే ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.


ఎమ్మెల్సీ ఎన్నిక అయినా వెంటనే నాగబాబును కేబినెట్ లోకి తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కానీ కేబినెట్లో ఒక్క సీటు ఖాళీగా ఉన్నది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకున్న చంద్రబాబు నాగబాబును ఎమ్మెల్సీగా ప్రకటించారనే విధంగా అభిప్రాయాలు వినిపించాయి. కానీ పవన్ కళ్యాణ్ దగ్గరే నాగబాబు మంత్రి పదవి పెండింగ్లో ఉన్నట్లు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, కందుల దుర్గేష్ కూడా ఓకే సామాజిక వర్గానికి చెందినవారు కావడం చేత ఇప్పుడు నాగబాబును కూడా కేబినెట్లోకి తీసుకుంటే.. ఖచ్చితంగా వారి యొక్క సామాజిక వర్గానికి అన్ని తీసుకున్నారనే ముద్ర పడుతుందని దీనివల్ల జనాలలో కార్యకర్తలలో కూడా తప్పుడు సంకేతాలు వెళ్లే అవకాశం ఉందని.. ఈ విషయంపైనే నాగబాబును కేబినెట్ లోకి తీసుకోవడం లేదనే విధంగా వినిపిస్తున్నాయి.


తన సోదరుడిని కేబినెట్లోకి తీసుకోవాలా వద్దా అనే డైలాగ్ మనం డిప్యూటీ సీఎం ఉన్నట్లుగా తెలుస్తోంది. నాగబాబు ఆలోచనలను పార్టీకి పూర్తిగా ఉపయోగించుకోవాలని పవన్ కళ్యాణ్ ప్లాన్ చేస్తున్నారట. అందుకే ఆయనతో జిల్లాల పర్యటనలను కూడా చేయించే ఆలోచనలో ఉన్నట్లు వినిపిస్తున్నాయి. ఒకవేళ మంత్రి పదవి ఇస్తే మాత్రం రెండిటికి ఒకేసారి న్యాయం చేయలేని పరిస్థితి ఉంటుందని ఆలోచిస్తున్నారట. పవన్ కళ్యాణ్ కూడా అటు డిప్యూటీ సీఎం గా ఇటు సినిమాల షూటింగ్లో బిజీగా ఉండడం చేత పార్టీకి సమయం కేటాయించే పరిస్థితి ఎక్కువగా ఉండదు. అందుకే తన సోదరుడు నాగబాబును పార్టీ కోసం ఎక్కువగా ఉపయోగించుకోవాలని ఆలోచనతో పవన్ కళ్యాణ్ ఉన్నట్లుగా తెలుస్తోంది. మరి పవన్ కళ్యాణ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: