
రైల్వే శాఖ రౌండ్ ట్రిప్ ప్యాకేజ్ పేరుతో ప్రవేశపెట్టిన ఈ స్కీమ్ వల్ల ప్రయాణికులకు దీర్ఘకాలంలో ప్రయోజనాలు కలగనున్నాయి. రౌండ్ ట్రిప్ ప్యాకేజ్ ను ఎవరైతే తీసుకుంటారో వాళ్ళు రిటర్న్ టికెట్ పై ఏకంగా 20 శాతం డిస్కౌంట్ పొందే ఛాన్స్ అయితే ఉంటుంది. ముందస్తు రిజర్వేషన్ ను ప్రోత్సహించాలనే మంచి ఆలోచనతో ఈ పథకాన్ని ప్రవేశపెట్టారని సమాచారం అందుతోంది.
ఆగష్టు 14వ తేదీ నుంచి ఈ ఆఫర్ అందుబాటులోకి రానుండగా రాయితీ వర్తించే తేదీలలో టికెట్లు బుకింగ్ చేసుకుంటే మాత్రమే ఈ బెనిఫిట్స్ పొందవచ్చు. సమీపంలోని రైల్వే శాఖను సంప్రదించడం ద్వారా ఈ పథకానికి సంబంధించిన పూర్తి విషయాలను తెలుసుకోవచ్చు.
ముందస్తు రిజర్వేషన్ రూల్ తో సంబంధం లేకుండా ఈ పథకం అమలవుతోంది అయితే బుకింగ్ చేసుకున్న టికెట్స్ కన్ఫర్మ్ అయితే మాత్రమే ఈ బెనిఫిట్స్ పొందవచ్చు. అయితే ఈ నిబంధనలను మ్యాచ్ చేస్తూ టికెట్లను బుకింగ్ చేసుకోవడం ఎంతవరకు సాధ్యమవుతుందో చూడాల్సి ఉంది. కొన్ని రోజులకే ఈ నిబంధనలను వర్తింపజేయడం ఏంటని కూడా కామెంట్లు వినిపిస్తున్నాయి.
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు