ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం వైసీపీ పార్టీ అధినేత జగన్ తాజాగా ఒక సంచలన ట్విట్ చేశారు. తన సొంత నియోజకవర్గమైన పులివెందులలో జరుగుతున్నటువంటి జడ్పిటిసి ఉప ఎన్నికల పై అలాగే అధికార పార్టీ అనుసరిస్తున్న వైఖరిని సైతం తెలియజేస్తూ సీఎం చంద్రబాబు పైన తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తూ ఒక ట్విట్ చేశారు. అధికార పార్టీ దౌర్జన్యాలకు సీఎం చంద్రబాబు ప్రోత్సాహారమే కారణమన్నట్లుగా ట్వీట్ చేస్తూ విమర్శించారు. అంతేకాకుండా చంద్రబాబు అనే వ్యక్తి అరాచక వాది, అప్రజాస్వామ్యక వాది అంటూ పలు రకాల ఆరోపణలు చేశారు.


రౌడీ రాజకీయాలు చేయడమే తప్ప ప్రజల అభిమానాన్ని ప్రజల మనసుని గెలుచుకొని రాజకీయాలు చేయాలని విమర్శించారు. పులివెందులలో ప్రజాస్వామ్య ఎన్నిక అస్సలు జరగడం లేదంటు వ్యాఖ్యానిస్తూ చివరికి ధర్మమే గెలుస్తుంది అంటూ ధీమాని తెలియజేస్తున్నారు. సుమారుగా అంశాలను ప్రస్తావిస్తూ జగన్ తన ట్విట్టర్ వేదికగా తెలియజేశారు. పులివెందల, ఒంటిమిట్ట జడ్పిటిసి స్థానాల ఉప ఎన్నికలలో అసలు ప్రజాస్వామ్యానికి పాతర వేస్తూ బరితెగిస్తూ రాజకీయాలు చేస్తున్నారంటూ చంద్రబాబును విమర్శించారు.


ముఖ్యమంత్రిగా తనకున్న అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని.. ఆయన అడుగులకు మరికొంతమంది అధికారులు మడుగులేస్తున్నారని.. టిడిపి అధికారులకు గ్యాంగులకు పోలీసులు ముఠాగా ఏర్పడి పులివెందుల ఎన్నికను హైజాక్ చేయడానికి ప్రయత్నిస్తున్నారంటూ తెలియజేశారు. కేవలం వైసీపీ నాయకులను, కార్యకర్తలను మాత్రమే బైండోవర్ చేస్తున్నారని.. ఇంతవరకు పోలీస్ స్టేషన్ గడపే తొక్కని వారందరి పైన కూడా కేసులు పెట్టేలా చూస్తున్నారని.. ఆగస్టు 5న పులివెందులలో ఒక వివాహానికి హాజరైన నేతలపై కొంతమంది టీడీపీ గ్యాంగ్ దాడి చేయగా..ఆ మరుసటి రోజునే కొంతమంది వైసీపీ నేతల పైన హత్యయత్నం జరిగిందని ఆరోపణలు చేశారు. వైఎస్ఆర్సిపి ఓట్లను తగ్గించేందుకే అధికార పార్టీలతో అధికారుల చేతులు కలిపి మరి పోలింగ్ బూతులను పక్క గ్రామాలకు మార్చారంటు ఆరోపణలు చేశారు. ఓటు వేయాలంటే రెండు గ్రామాల ప్రజలు సుమారుగా రెండు నుంచి నాలుగు కిలోమీటర్లు వెళ్లాలని.. ఇలా ఎన్నో కుట్రలు చేస్తున్నారంటూ జగన్ ట్వీట్ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: