
పూర్తి వివరాలలోకి వెళితే దేవీపట్నం మండలంలో శరభవరం సచివాలయంలో సౌమ్య వెల్ఫేర్ అసిస్టెంట్ గా పనిచేస్తోంది. ఈమెను గత కొన్నేళ్లుగా కాసింకోట అనిల్ కుమార్ ప్రేమిస్తున్నారట. అయితే ఆమె ఆ ప్రేమను నిరాకరిస్తూ వస్తూ ఉండడంతో ఎలాగైనా పెళ్లి చేసుకోవాలని..ఆమె విధులలో ఉండగానే కొంతమందితో కలిసి కత్తులు చూపించి ఆమెను కిడ్నాప్ చేశారు. దీంతో ఒక్కసారిగా సచివాలయ ఉద్యోగులు ఉలిక్కిపాటికి గురయ్యారు. స్థానికులు అడ్డుకునే ప్రయత్నం చేసిన వారందరిని బెదిరించి సౌమ్యను తీసుకొని పారిపోయారు. ఈ కిడ్నాప్ విషయాన్ని పోలీసులకు తెలియజేయగా.. అన్ని కోణాలలో పోలీసులు విచారించగా కిడ్నాప్ వెనుక ప్రేమ వ్యవహారం ఉందని తేల్చారు. సుమారుగా నాలుగు రోజులపాటు పోలీసులు శ్రమించి నిందితులను పట్టుకున్నారు. అలాగే సచివాలయ ఉద్యోగి సౌమ్యను కూడా రక్షించినట్లుగా తెలుస్తోంది.
సౌమ్యని అదుపులోకి తీసుకున్న అనంతరం వైద్య పరీక్షలకు ఆసుపత్రికి పంపించారు పోలీసులు. నిందితుడు అనిల్ కుమార్ కు గతంలో కూడా చాలా నేర చరిత్ర కలిగి ఉన్న వ్యక్తి అని అతనిపైన గంజాయి కేసుతో పాటు పలు రకాల క్రిమినల్ కేసులు ఉన్నాయట. అలాగే అనిల్ కుమార్ కి సహాయం చేసిన మణి మోహన్ దొర, పూసం పవన్ కుమార్లను కూడా అరెస్టు చేశారు. వీరిద్దరితో పాటుగా దేవిపట్నం మండలానికి చెందిన మరో ఇద్దరిని అరెస్టు చేసినట్లుగా తెలుస్తోంది.దీంతో ఈ రోజున ఈ నిందితులను సైతం కోర్టులో హాజరుపరచబోతున్నట్లు తెలియజేశారు.