ప్రస్తుత ప్రపంచ దేశాలలో అగ్రరాజ్యమైనటు వంటి అమెరికాకు ట్రంప్ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. అయితే ట్రంప్ ఇతర దేశాలన్నింటితో కలుపుకొని  అన్నింటిపై ఆజమాయిషి చెలాయిస్తూ ఉంటారు. అలాంటి డోనాల్డ్ ట్రంప్ గురించి తాజాగా ఒక సీనియర్ హాలీవుడ్ నటి ఎమ్మా థాంప్సన్ కొన్ని సంచలన విషయాలను బయట పెట్టింది. ఇటీవల లోకార్నో ఫిల్మ్ ఫెస్టివల్ లో  పాల్గొని ఆమె షాకింగ్ విషయాలను వెల్లడించింది. ఇంతకీ ఆమె ఏమన్నదయ్యా అంటే.. నేను విడాకులు తీసుకున్న తర్వాత అమెరికా అధ్యక్షుడు అయినటువంటి డోనాల్డ్ ట్రంప్ ఫోన్ చేసి నన్ను డేటింగ్  కి రమ్మన్నాడంటూ తెలియజేసింది. 1998లో నేను 'ప్రైమరీ కలర్స్' అనే మూవీ షూటింగ్ లో ఉన్నప్పుడు ఈ ఘటన జరిగిందని చెప్పింది.. 

తనకు డొనాల్డ్ ట్రంప్ ఫోన్ చేసి నేను ట్రంప్ ను మాట్లాడుతున్నానని చెప్పినట్లు ఆమె తెలియజేసింది. అయితే మొదట ఈ కాల్ ఏదో రాంగ్ నెంబర్ అనుకుందట. కానీ మీకు ఏ విధంగా సహాయ పడగలను, నేను ట్రంప్ ను అని ఆయన గట్టిగా చెప్పారట. అంతేకాదు మనం ఇద్దరం కలిసి డేట్ కి వెళ్దాం అంటూ తెలియజేశారు. దీంతో ఎమ్మా థాంప్సన్ సున్నితంగా స్పందిస్తూ చాలా బాగుంది, ధన్యవాదాలు. నేను ఫ్రీగా ఉన్నప్పుడు తిరిగి మీకు కాల్ చేస్తానని చెప్పి పెట్టేసినట్లు తెలియజేసింది. అంతేకాదు ఈ ఘటన జరిగిన రోజే నాకు అధికారికంగా విడాకులు కూడా వచ్చాయని తెలియజేసింది..

మరో విచిత్రం ఏంటంటే ట్రంప్ కూడా అతని రెండో భార్య మార్ల మాపుల్స్ నుంచి  విడిపోయారని, అప్పుడే తన జీవిత భాగస్వామి గురించి వెతుకుతున్నారని ఎమ్మా థాంప్సన్ వ్యాఖ్యానించింది.. అంతేకాదు ట్రంప్ నా నెంబర్ తెలుసుకొని మరీ ఫోన్ చేశాడంటే తను నన్ను ఎప్పటినుంచి ఫాలో అవుతున్నారో నాకు ఆ రోజే అర్థమైందని అన్నది. ఒకవేళ ట్రంప్ చెప్పినట్టు నేను ఆ రోజు విని ఉంటే అమెరికా చరిత్ర మార్చే అవకాశం నాకు కూడా దక్కేది అంటూ ఆమె నవ్వుతూ చెప్పుకొచ్చింది.. ఇక ఇదే కాకుండా గతంలో ట్రంప్ డేట్ కి రమ్మన్నాడని మరో నటి కూడా  ఒక ఇంటర్వ్యూలో బయటపెట్టింది. ఇక ఎమ్మా థాంప్సన్ విడాకుల తర్వాత గ్రేగ్ వైస్ ను పెళ్లి చేసుకుని ఆనందంగా జీవిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: