
తాను అమెరికాలో ఉన్నానని ఇండియాకి వచ్చిన తర్వాత ఈ విషయం పైన స్పందిస్తానని చెప్పిన రవికుమార్ ఈ క్రమంలోనే నిన్నటి రోజున రవికుమార్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కేజీబీవీ ప్రిన్సిపల్ సౌమ్య తన పైన చేసిన ఆరోపణలను తాను తీవ్రంగా ఖండిస్తున్నానని తెలియజేశారు. తాను అందరూ ప్రిన్సిపల్స్ తో కూడా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించానని తెలిపారు. ముఖ్యంగా ప్రవేశాల విషయంలో విద్యార్థుల తల్లిదండ్రుల విజ్ఞప్తి మేరకే ఈ కేజీబీవీ ప్రిన్సిపల్ తో మాట్లాడాను అంటూ తెలియజేశారు. ఆమె మీద చాలానే ఫిర్యాదులు వచ్చాయని ఈ మేరకు చర్యలు తీసుకోవాలి అంటూ జిల్లా అధికారులను కోరినట్లుగా తెలిపారు టిడిపి ఎమ్మెల్యే రవికుమార్.
ఉద్యోగులను బదిలీ చేస్తే వేధింపులు అవుతాయా అంటూ ప్రశ్నించారు 30 ఏళ్లుగా తాను రాజకీయాల్లో ఉన్నారని ఏనాడు ఇలాంటి నేచర్ రాజకీయాలకు పాల్పడలేదు అంటూ తెలియజేశారు తన పైన అసత్య ఆరోపణలు చేస్తున్న వారు ఖచ్చితంగా బహిరంగ క్షమాపణలు చెప్పాలని లేకపోతే కేజీబీవీ ప్రిన్సిపల్ తో పాటుగా వైసీపీ నేతలు పైన కూడా పరువు నష్ట దావా వేస్తానంటు తెలియజేశారు ఎమ్మెల్యే. ఈ విషయం పైన అసెంబ్లీ ప్రివిలీజు కమిటీకి కూడా ఫిర్యాదు చేయబోతున్నట్లు తెలియజేశారు తన కుటుంబం జోలికి వస్తే ఎవరినైనా ఎదిరిస్తాను అంటు ధైర్యంగా తెలియజేశారు ఎమ్మెల్యే రవికుమార్.