
తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్లే వారికి కూడా ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామని కొండపై వరకు వీటిని పొడిగించినట్లుగా ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణ తెలియజేశారు. ఈ విషయాన్ని పలువురు అధికారులతో పాటు ఎమ్మెల్యే బుద్ధ ప్రసాద్ పరిశీలించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం తిరుమల కొండపై వరకు పొడిగిస్తున్నామంటూ తెలిపారు. ముఖ్యంగా ఆస్పత్రులకు, పుణ్యక్షేత్రాలకు వెళ్లేవారు, చిరుద్యోగులు చేసే మహిళలకు ఈ బస్సు ప్రయాణం చాలా ఉపయోగపడుతుందని తెలిపారు.
ఈనెల 16 నుంచి 10 లక్షల మంది, 17వ తేదీ నుంచి 15 లక్షల మంది, అలాగే 18వ తేదీ 18 లక్షల మంది వరకు ఉచిత ప్రయాణాన్ని ఉపయోగించుకున్నారు అంటూ అధికారులు తెలుపుతున్నారు. తిరుమలలో కూడా భక్తుల రద్దీ ఎక్కువగానే కొనసాగుతోంది.. 30 కంపార్ట్మెంట్లలో కూడా భక్తులు వేచి ఉంటున్నారంటూ తెలిపారు. టోకెన్లు లేకుండానే శ్రీవారి దర్శనానికి సుమారుగా 12 గంటల సమయం పడుతుందని నిన్నటి రోజున 76,033 వేల మంది భక్తులు దర్శించుకున్నారని..5.03 కోట్ల రూపాయల శ్రీవారి ఆదాయం వచ్చిందంటూ టీటీడీ అధికారులు కూడా తెలియజేస్తున్నారు. మొత్తానికి తిరుపతికి వెళ్లే వారికి కూడా ఈ బస్సు ప్రయాణం ఉచితమని చెప్పడంతో మరింత భక్తులు వెళ్లే అవకాశం ఉంటుంది.