
2017లో కర్నూలులోని ఒక హాస్టల్లో గిరిజన బాలికా సుగాలి ప్రీతి ఆత్యాచార, హత్యకు గురయ్యింది. సుగాలి ప్రీతికి న్యాయం జరగాలని ఎనిమిదేళ్లుగా ఆమె తల్లి పార్వతి పోరాటం చేస్తూనే ఉన్న ఇప్పటివరకు న్యాయం జరగలేదని మాట ఇచ్చిన పవన్ కళ్యాణ్ కూడా పట్టించుకోలేదని విజయవాడలో ఆరోపణలు చేసింది. ఈ విషయం పవన్ కళ్యాణ్ దృష్టికి రాగా స్పందించారు.. సుగాలి ప్రీతి కేసు వ్యవహారంలో తన పరిస్థితి ఎలా మారిందంటే పళ్ళున్న చెట్టుకే రాళ్ల దెబ్బలు అన్నట్టుగా మారిందని తెలిపారు. గత ప్రభుత్వంలో ఎవరైనా సరే ఈ విషయంపై సీఎం ఎదుట ధైర్యంగా మాట్లాడారా?.. సుగాలి ప్రీతి తల్లి ఆవేదనను చూసి కర్నూలు కి వెళ్లి బలంగా ఈ విషయం పైన గళం విప్పానని తెలిపారు.
తన పోరాటం వల్లే అప్పటి ప్రభుత్వం ఆ కేసును నడిపిందని.. కర్నూలు కి 9.కి. మి దూరంలో దిన్నెదేవరపాడులో బహిరంగంగా మార్కెట్లో రూ.2 కోట్లు ఎకరా ధర పలికేటువంటి వ్యవసాయ భూమిని 5 ఎకరాలు ఇచ్చారు.. కల్లూరులో 5 సెంట్ల ఇళ్ల స్థలంతో పాటుగా సుగాలి ప్రీతి తండ్రికి ప్రభుత్వ ఉద్యోగం రావడానికి కారణం తాను విప్పిన గళం కారణం అంటూ తెలిపారు. తాను డిప్యూటీ సీఎం అయ్యాక ఈ కేసు పైన సిఐడి చీఫ్ తో మాట్లాడి ఈ కేసు పైన న్యాయం చేయాలని సూచించాను. ఈ విషయంపై హోంమంత్రితో కూడా మాట్లాడాను అయితే విచారణలో అనుమానితుల డిఎన్ఏ సరిపోలడం లేదని సాక్షాలను తారుమారు చేశారని తేలిందని తెలిపారు పవన్ కళ్యాణ్. అందుకే ఈ కేసు విచారణలో ఇబ్బందులు తలుగుతున్నాయని వెల్లడించారు..సుగాలి ప్రీతి తల్లి పార్వతి చేసిన విమర్శలకు పవన్ కళ్యాణ్ స్పందించారు