రాజకీయాలు పూర్తిగా వంటబడితే బంధాలు, బంధుత్వాలు అనేవి కనిపించవు.. పూర్తిగా రాజకీయాలపై దృష్టి పెట్టి  సొంత వాళ్లను కూడా దూరం చేసుకునే పరిస్థితులు వస్తాయి.. కుటుంబాలకు కుటుంబాలే విడిపోయే పరిస్థితులు ఏర్పడతాయి.. అలాంటి ఈ తరుణంలో కేసీఆర్ ఫ్యామిలీలో కవిత ఒక తలనొప్పిలా తయారైంది..కేసీఆర్ పతనానికి ఆమె మూల కారణం అవుతుంది.. కవిత చేస్తున్నటువంటి ఆరోపణలు  పార్టీ పతనానికి పూర్తిగా  దోహదం చేస్తున్నాయి.. తాజాగా ఆమె హరీష్ రావు, సంతోష్ రావులపై తీవ్రమైన ఆరోపణలు చేసి పార్టీని డ్యామేజ్ చేసే ప్రయత్నం చేసింది. కేసీఆర్ అనే వ్యక్తి అవినీతి ఎరగడని, ఆయనకు హరీష్ రావు సంతోష్ రావులు అవినీతి మరక పూయాలని చూస్తున్నారన్నారు.. దీంతో రాష్ట్రవ్యాప్తంగా కవితపై బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు మండిపడ్డారు. 

ఆమె దిష్టిబొమ్మలు దహనం చేశారు. అంతేకాదు ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ నిర్ణయం కూడా తీసుకున్నారు.. ఇదే క్రమంలో కొంతమంది ఆమెకు కాంగ్రెస్ సపోర్ట్ చేస్తుంది అంటే, మరి కొంతమంది బిజెపి సపోర్ట్ చేస్తుంది అంటున్నారు. ఎవరు ఏది అనుకున్న కవిత కూడా కేసీఆర్ కుటుంబానికి చెందిన నాయకురాలు. కేసీఆర్ లేకుంటే ఆమెకు ఈ ఐడెంటిటీ ఉండేది కాదు.. అలాంటి ఈమెనే ముందు లిక్కర్ స్కామ్ లో ఇరుక్కుని కేసీఆర్ పరువు తీసింది. కేటీఆర్, హరీష్ రావు అందరూ దొంగలంటూ చెప్పుకస్తోంది. ఆ పార్టీలో వాళ్లు దొంగలు అయితే ఈమె దొరకాదు కదా.. ఈమె కూడా ఒక దొంగే అవుతుంది కదా అంటూ కొంతమంది రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఈ విధంగా కవిత చేస్తున్న పనులకు ఒక భజన బ్యాచ్  ఓహో, అదరహో అనుకుంటూ ఆమెను ఆకాశానికి ఎత్తుతున్నారు.

చివరికి ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ అయ్యేలా చేశారు. కట్ చేస్తే  ప్రస్తుతం కవితకు రెండు దారులు ఉన్నాయి.. ఒకటి కాంగ్రెస్ పార్టీలో చేరడం లేదంటే తానే సొంతంగా పార్టీ పెట్టుకోవడం.. తాజాగా కాంగ్రెస్ లో కవితకు ఛాన్స్ లేదని వాళ్ళు ప్రకటించారు.. ఒకవేళ కవిత పార్టీ పెడితే మాత్రం తప్పకుండా బీఆర్ఎస్ నుంచి వచ్చిన కొంతమంది నాయకులు కవిత పార్టీలో చేరతారు. అంతేకాదు రాబోవు ఎలక్షన్స్ లో ఓట్లు కూడా చీలిపోతాయి. దీనివల్ల గందరగోళం ఏర్పడి  మళ్లీ ఎలక్షన్స్ లో కాంగ్రెస్ కు ప్లస్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. ఒకవేళ ఈ రెండు పార్టీలు రాకుంటే బిజెపి అధికారం చేపట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అలా కవిత తీసుకునే నిర్ణయాలు బీఆర్ఎస్ పార్టీ పతనాన్ని సూచిస్తున్నాయి అంటున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు

మరింత సమాచారం తెలుసుకోండి: