ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడిగా పేరుపొందిన కేఏ పాల్ గురించి రెండు తెలుగు రాష్ట్ర ప్రజలకు చెప్పాల్సిన పనిలేదు. అటు పొలిటికల్ పరంగా ఎప్పుడు యాక్టివ్ గా ఉంటూ తనదైన స్టైల్ లో స్పందిస్తూ ఉంటారు. కేఏ పాల్ పైన తాజాగా పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయినట్లుగా సమాచారం. తనను లైంగికంగా వేధిస్తున్నాడంటూ కేఏ పాల్ పైన ఒక యువతి ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి మరి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిసింది.


ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఆఫీసులో పనిచేస్తున్న ఒక యువతి తనను లైంగికంగా వేధిస్తున్నారని ఆమె షిటీమ్ ని ఆశ్రయించింది.. ఆ యువతి తెలిపిన వివరాల ప్రకారం.. కేఏపాల్ కంపెనీలో పని చేస్తున్న యువతి నైట్ షిఫ్ట్ లో పనిచేస్తున్న సమయం లో తన పైన లైంగిక వేధింపులకు పాల్పడ్డారంటూ ఆ యువతి ఆరోపణలు చేసింది. అంతేకాకుండా వారి వాట్సాప్ మెసేజ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లుగా సమాచారం. కేఏ పాల్ తనకు దగ్గరగా ఆనుకొని మాట్లాడుతారని, షోల్డర్ పై భాగంలో చేయితో తాకుతూ ఉంటారంటూ ఆ యువతి ఫిర్యాదులో తెలియజేసింది.

 ఆ బాధితురాలు గత 15 రోజులుగా ఈమె కేఏపాల్ కంపెనీలో అమెరికన్ కోఆర్డినేటర్గా పనిచేస్తున్నట్లు సమాచారం. అయితే ఇలాంటి సమయంలోనే కేఏ.పాల్ తనతో అసభ్యకరంగా ప్రవర్తించారంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది..అందుకు సంబంధించి ఆధారాలను ఆ బాధితురాలు షి టీమ్ కి అందజేసినట్లుగా సమాచారం. ఈ విషయాన్ని పంజాగుట్ట పోలీస్ స్టేషన్కు షి టీమ్ కూడా ట్రాన్స్ఫర్ చేసింది. ఈ కేసుకు సంబంధించి అధికారులు, పోలీసుల సైతం దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. మరి కేఏ పాల్ పైన వచ్చిన ఈ ఆరోపణలపై ఆయన ఏవిధంగా స్పందిస్తారో చూడాలి మరి. రెండు తెలుగు రాష్ట్రాలలో పొలిటికల్ పరంగా కూడా యాక్టివ్ గా ఉంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: